Cultivation Of Crops : తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు.. వాణిజ్య పంటల స్థానంలో చిరుధాన్యాలే మేలు

ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఏదో ఒక పంట కాలం , కరవు బారిన పడుతోంది. వర్షాల మధ్య విరామం పెరిగింది. పైరు నిలదొక్కుకునే వీలుకలగడం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలవల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. 34 శాతం భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలులేక, ప్రాజెక్టుల నీరు అందక, చాలీచాలనీ భూగర్భజలాలతో సాగునీటి సమస్య తీవ్రమై అన్నదాతలు నష్టాలపాలవుతున్నారు.

Cultivation Of Crops

Cultivation Of Crops : వర్షాధారంగా పంటల సాగు రైతుకు కత్తిమీద సాములా వుంది. వాతావరణం అనుకూలిస్తే సరి. లేకపోతే పెట్టిన పెట్టుబడి, పడ్డం కష్టం అంతా బూడిదలో పన్నిరే అవుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో సరైన వర్షాలు పడలేదు.  ఈ నేపధ్యంలో  తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాలను సాగుచేస్తే స్వల్పకాలంలో మంచి ఫలితాలు సాధించవచ్చని  సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.శోభా .

READ ALSO : Cultivation Of Kharif Crops : ఖరీఫ్ అపరాల సాగులో యాజమాన్యం

కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు అధికమయ్యాయి. ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఏదో ఒక పంట కాలం , కరవు బారిన పడుతోంది. వర్షాల మధ్య విరామం పెరిగింది. పైరు నిలదొక్కుకునే వీలుకలగడం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలవల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. 34 శాతం భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలులేక, ప్రాజెక్టుల నీరు అందక, చాలీచాలనీ భూగర్భజలాలతో సాగునీటి సమస్య తీవ్రమై అన్నదాతలు నష్టాలపాలవుతున్నారు. పంటల ఎదుగుదల, దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం పడి, ఆశించిన ఫలసాయం పొందడం కష్టమవుతోంది. వాతావరణ సవాళ్ల కారణంగా రకరకాల తెగుళ్లు, చీడపీడలు విజృంభిస్తున్నాయి.

READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

ప్రస్తుతం ఖరీస్ సీజన్ ప్రారంభమై కొన్ని చోట్ల ఇప్పటికే విత్తనాలు వేయగా.. మరి కొన్ని విత్తనాలునాటే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అయితే తక్కువ వర్షాపాతం నమోదయ్యే ప్రాంతాలలో ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలను సాగుచేయడం, పంట తీయడం కష్టమైన పని . దీనికి సరైన ప్రత్యామ్నాయ మార్గం చిరుధాన్యాలే అంటున్నారు శాస్త్రవేత్తలు .  ప్రస్తుతం చిరుధాన్యాలైన సజ్జలు జులై 15 వరకు, మిగతా చిరుధాన్యాలను  జులై చివరి వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు ఒకటిన్నర నుండి రెండు కిలోల విత్తనం సరిపోతుందని సాగు వివరాలను తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతాయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త, డా. శోభ.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సరైన పంటల ఎంపిక చాలా అవసరం . ఎక్కువ నీరు అవసరమైన పంటలకన్న, తక్కువగా నీటి వినియోగం అవసరం ఉండే పంటలైన చిరుధాన్యాలను ఎంపిక చేసుకోవడం  ద్వారా, సమయం కలిసి రావడమే  కాకుండా పెట్టుబడులు తగ్గి, మంచి దిగుబడులను సాధించవచ్చు.