Cattle Diseases : వర్షాకాలంలో పాడిపశువులకు అనేక రోగాలు – ముందస్తు జాగ్రత్తలు! 

Cattle Diseases : వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు, మనుషులకే కాదు.. మూగజీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. కాటేయటానికి అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి.

Diseases of Cattle

Cattle Diseases : గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పశుసంపదే జీవనాధారం. కరువుకాలంలో ఆదుకోవటంతోపాటు, నిత్యం స్థిరమైన ఆదాయానిచ్చే పరిశ్రమగా పశుపోషణ విరాజిల్లుతోంది. వర్షాకాలం కావడంతో కొత్త పచ్చిక, కొత్తనీరుతో పశువుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.  ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, చిటుకు వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ప్రాణాంతకం కూడా. వర్షాకాలంలో వచ్చే వ్యాదుల పట్ల తీసుకోవాల్సిన జాత్రత్తలను తెలియజేస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం , పశుసంవర్ధక శాఖ, అసిస్టెంట్ సర్జన్ ,  డా. కొర్లకుంట కిషోర్ .

Read Also : Cattle Breeding Techniques : లేగదూడల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు, మనుషులకే కాదు.. మూగజీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. కాటేయటానికి అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి. ఈ సీజన్ లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో పశువులకు సోకేది గొంతువాపు వ్యాధి. దీనినే గురకవ్యాధి అంటారు.  ఇది నల్లజాతి రకాలైన గేదెలు, దున్నల్లో వస్తుంది . అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడతాయి.

వ్యాధి సోకిన పశువుకు శ్వాస పీల్చినప్పుడు ఆయాసం వస్తుంది. గురక వినిపిస్తుంది. గొంతు పైభాగం, మెడ కింది భాగాన వాపు వస్తుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. జ్వర తీవ్రత  104 నుండి 106 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన  పశువు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ వ్యాధిని గుర్తించిన రైతులు వెంటనే స్థానికంగా ఉండే పశువైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు  ఖమ్మం రూరల్ మండలం , పశుసంవర్ధక శాఖ, అసిస్టెంట్ సర్జన్ ,  డా. కొర్లకుంట కిషోర్ .పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాదు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.

Read Also : Cotton Crop : పత్తి పంటలో కలుపు నివారణ.. పత్తిలో ఆగిన పెరుగుదల

ట్రెండింగ్ వార్తలు