Cattle Breeding Techniques : లేగదూడల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Cattle Breeding Techniques : లేగదూడలు మంచి పాడిపశువుగా అందిరావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Cattle Breeding Techniques in Telugu
Cattle Breeding Techniques : పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడిపశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలామంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధకనబరచటం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా వుండి, పరిశ్రమ కుంటుపడుతోంది.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
పాల ద్వారా వచ్చే ఆదాయంతోపోలిస్తే, మన దొడ్లో పుట్టిన దూడ, పాడిపశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి లేగదూడలు మంచి పాడిపశువుగా అందిరావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి పెయ్యదూడలే రేపటి పాడిపశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్యదూడల సంరక్షణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది. మొదటి 3 – 4 మాసాల వయస్సు అత్యంత కీలకమైనది. కాబట్టి శాస్త్రీయంగా చేపట్టే దూడల పోషణ మంద వృద్ధికి నాంది. ఆరోగ్యవంతమైన లేగదూడల పెంపకం డెయిరీ అభివృద్ధికి పునాది లాంటిదనటంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈ సత్యాన్ని గమనించని చాలా మంది రైతులు పాలద్వారా వచ్చే ఆదాయం పైనే దృష్టి పెట్టి, ఆ తర్వాత పశువుల మేపు భారమై, కొత్తగా పశువులు కొనుగోలు చేసేందుకు శక్తి లేక అనతికాలంలోనే డెయిరీలను మూసివేస్తున్నారు. ముఖ్యంగా దూడల పెంపకంపై వున్న నిర్లక్ష్యం వల్ల, ఏటా 20 నుండి 30 శాతానికి పైగా మరణాలు సంభవిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
పాడిపరిశ్రమను ఒక ఆదాయ వనరుగా చూడటమే తప్ప, దూర దృష్టిలేక పోవటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మేలు జాతి లేగదూడల సంరక్షణకు పాడి గేదెలు లేదా ఆవులు చూడితో వున్నప్పటినించే తగిన జాగ్రత్తలు తీసుకుని, పుట్టిన ఏడాదిన్నర వరకు సంరక్షించగలిగితే, 2వ ఏట, చూడికట్టి పాడిపశువుగా అందివస్తుంది. లేగ దూడల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు మండల పశువైద్య శాఖ సహాయ సంచాలకులు డా. బి. బసవ శకంర్ రావు.
Read Also : Paddy Cultivation : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు – డ్రమ్ సీడర్‌తో వరి సాగు అధిక లాభం