Paddy Cultivation : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు – డ్రమ్ సీడర్‌తో వరి సాగు అధిక లాభం
Drum Seeder Techniques : చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి, అదునులోనే పంట సాగుచేస్తున్నారు.

Drum Seeder Techniques In Paddy Cultivation
Drum Seeder Techniques : అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. దీనికి తోడు కూలీల కొరత అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి, అదునులోనే పంట సాగుచేస్తున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
దీంతో ఎకరాకు రూ. 5 వేల వరకు ఖర్చు తగ్గడమే కాకుండా, నారు, నాట్లతో పనిలేకుండా, తక్కువ శ్రమతో మంచి ఫలితాలు చేతికందుతున్నాయి. అయితే ఈ విధానంలో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చిన సూచిస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి.
ఇటీవలి కాలంలో వరిసాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్దతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్దతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట కూడా 7 నుండి 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది.
నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి రూ. 2500 నుండి 3 వేల వరకు తగ్గుతుంది. మొక్కల సాంధ్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశం ఉంది.
అందువలన తెలంగాణలోని కొన్ని జిల్లాలో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు… నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి.
డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసేటప్పుడు.. సాధారణ పద్దతిలో వరినాటేటప్పుడు కంటే భూమినంత బాగా చదును చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి. అంతే కాదు సాధారణ పద్ధతిలాగేనే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
Read Also : Kandi Cultivation : ఖరీఫ్ కందికి స్వల్పకాలిక, మధ్యస్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి