Kandi Cultivation : ఖరీఫ్ కందికి స్వల్పకాలిక, మధ్యస్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి
Kandi Cultivation : పప్పుల కొరత తీర్చడంతోపాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి.

Superior Ownership in Kandi Cultivation
Kandi Cultivation : కందిపంట సాగులో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పప్పుల కొరత తీర్చడంతోపాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఖరీఫ్ కందిని చాలా చోట్ల రైతులు విత్తారు. మరి కొంత మంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. ఈ నేపద్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. సంధ్యా కిషోర్.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదు. పైగా మెట్టప్రాంతాల్లో కంది దిగుబడులు నామమాత్రంగా వుండటంతో, అధికోత్పత్తిని అందించే వివిధ రకాలను ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు.
అయితే, ఖరీఫ్ కందిని జులై 15 వరకు విత్తుకోవచ్చు. ఇప్పటికే చాలాచోట్ల రైతులు విత్తారు. మరి కొంత మంది విత్తేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఎకరాకు విత్తన యోతాదు, నేలల బట్టి సాళ్ల మధ్య దూరం ఎన్నుకొని నాటాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. సంధ్యా కిషోర్.
సకాలంలో విత్తడం ఒకఎత్తైతే, కలుపు నివారణ మరో ఎత్తు. అంతే కాదు పూత, పింద దశల్లో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని నిర్మూలించాలి.
కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎకరాకు 8 -10 క్వింటాళ్ల దిగుబడిని తీయవచ్చు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు