White Fish Farming : తెల్లచేపల పెంపకంలో అధిక ఆదాయం పొందుతున్న రైతు

White Fish Farming : మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గంతలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకొని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది.

White Fish Farming : తెల్లచేపల పెంపకంలో అధిక ఆదాయం పొందుతున్న రైతు

a farmer who earns highest income

White Fish Farming : వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునే రోజులు పోయాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు,  మార్కెట్ ఆటుపోట్లు , పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కాబడం లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అవకాశం ఉన్నంత వరకు అనుబంధరంగాలవైపు మొగ్గుచూపుతున్నారు రైతులు. ఇందులో పాడిపశువులు, జీవాలు, కోళ్ల పెంపకంతో పాటు చేపల పెంకం ఉండగా.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయంతోపాట 5 ఎకరాల్లో మిక్స్ డ్ తెల్లచేపల పెంపకం చేపడుతూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గంతలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకొని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే, చేపల పెంపకంలో ఆదాయం తక్కువ వున్నా, స్థిరమైన రాబడి వుండటం, నష్ట భయం తక్కువ వుండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు. ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు.

వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో రెండంగుళాల సైజులో అంటే ఫింగర్ లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్థుతం జీరో పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి రెండేళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది.

ఈ కల్చర్ కు కూలీల అవసరం తక్కువగా వుండటం వల్ల, రైతుకు రిస్కు తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతీ పంటలోను 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా, ఉంగుటూరుకు చెందిన రైతు వీర్ల వెంకట కృష్ణారావు. తను 30 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూనే.. అనుబంధంగా 5 ఎకరాల్ల చేపల చెరువును కౌలుకు తీసుకొని ఫంగస్ తో పాటు తెల్లచేపలైన రాగండి, బొచ్చ, మైలామోసు , గడ్డిచేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఫంగస్ చేపల పట్టుబడి చేస్తుండగా, మిగితా చేపలు పట్టుబడికి మరో 4 నెలలల్లో పట్టుబడికి రానున్నాయి.

ఆదాయం వస్తుందన్న ఆశతో దాదాపు 25 లక్షల రూపాయలకు పైనే పెట్టుబడులు పెట్టి చేపలను సాగు చేపట్టారు రైతు. ఇప్పటికే ఫంగస్ చేపలు దాదాపు 12 టన్నుల అమ్మకం చేపట్టారు. టన్ను ధర రూ. 70 వేల చొప్పున 8 లక్షల వరకు ఆదాయం పొందారు. మరో 15, 16 దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

వీటివై వచ్చే ఆదాయంతో పెట్టుబడి చేతికి వస్తుండగా రాగండి, టన్నులు. బొచ్చె, గడ్డిచేపలు దాదాపు  20 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వీటికి మార్కెట్ లో టన్ను ధర 1 లక్ష రూపాయలు ఉంది. అంటే 20 టన్నులకు రూ. 20 లక్షల ఆదాయం . ఇదంతా లాభంగా చెప్పవచ్చు.

Read Also : Pests of Cotton : ప‌త్తిలో ర‌సం పీల్చే పురుగుల నివార‌ణ‌