Ginger Root Chips : అల్లంను చిప్స్ గా మార్చి అమ్ముతున్న రైతులు

గతంలో ఐటిడీఏ అధికారులు.. గిరిజనులు అల్లంపంట సాగుపై చూపుతున్న శ్రద్ధను గమనించి సబ్సిడీపై మేలురకం అల్లం విత్తనాలను అందజేసి ప్రోత్సహించింది. ఇప్పుడా ప్రోత్సాహం లేదు.  మరోవైపు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో అల్లం పంటను పూర్తిగా తగ్గించేశారు రైతులు.

Ginger Root Chips

Ginger Root Chips : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదేళ్లుగా పసుపు, అల్లంతో పాటు సీజనల్‌గా పండించే రాజ్‌మా లాంటి పంటల ధరలు దిగజారి పోతున్నాయి. సరైన మార్కెట్ సదుపాయం లేదు. సంతలనే ప్రధాన మార్కెట్లుగా చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. వ్యాపారులు కుమ్మక్కై, తప్పుడు తూకాలతో విశాఖ మన్యం రైతులను నట్టేట ముంచేస్తున్నారు. ఈ సమస్యలనుండి బయట పడేందుకు రైతులందరిని ఒక సొసైటీగా ఏర్పాటు చేసి, వారి దిగుబడులను ఉప ఉత్పత్తులుగా తయారుచేయిస్తూ.. ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం.

READ ALSO : Ginger Cultivation : అల్లం సాగులో సస్యరక్షణ, చీడపీడల నివారణ!

ఏళ్ల తరబడి గిరిజనులకు ఆర్థిక భరోసా ఇచ్చిన అల్లం పంట క్రమేపీ కనుమరుగవుతోంది. సాగు విస్తీర్ణంగా ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. వాణిజ్య పంటల్లో ఒకటైన అల్లాన్ని గిరిజనులు విస్తారంగా సాగు చేసేవారు.  ప్రతి గిరిజనుడు తమకున్న భూమిలో రెండు మూడు మళ్లు ప్రత్యేకంగా అల్లం పంట కోసం కేటాయించేవారు.

కేవలం సేంద్రియ ఎరువులతోనే పండించడం వల్ల ఇక్కడ సాగు చేసిన అల్లానికి ఎంతో డిమాండ్ ఉండేది. మైదాన ప్రాంత వ్యాపారులు నేరుగా గిరిజన గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి నేరుగా టన్నుల కొద్దీ అల్లాన్ని కొనుగోలు చేసి లారీలు, వ్యాన్లపై నగరాలకు తరలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదారు సంవత్సరాల నుంచి అల్లం పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది.

READ ALSO : Ginger Seed Collection : అల్లం విత్తన సేకరణలో జాగ్రత్తలు

గతంలో ఐటిడీఏ అధికారులు.. గిరిజనులు అల్లంపంట సాగుపై చూపుతున్న శ్రద్ధను గమనించి సబ్సిడీపై మేలురకం అల్లం విత్తనాలను అందజేసి ప్రోత్సహించింది. ఇప్పుడా ప్రోత్సాహం లేదు.  మరోవైపు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో అల్లం పంటను పూర్తిగా తగ్గించేశారు రైతులు.

ఈ పరిస్థితుల్లో చింతపల్లి మండలంలోని సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం.. స్థానిక రైతులను ఒకతాటిపైకి తీసుకొచ్చి, వారికి నాణ్యమైన అల్లం విత్తనాలను అందజేసి, వారిచేత సాగుచేయించింది. వచ్చిన దిగుబడిని మార్కెట్ ధర కంటే అధికంగా చెల్లించి కొనుగోలుచేస్తున్నారు.

READ ALSO : Farming Pears : పియర్ సాగు ఎలా చేస్తే లక్షల రూపాయలు సంపాదిస్తారో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్ లో అల్లం ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో,  అల్లంముక్కలుగా చేసి మార్కెట్ చేస్తున్నారు. వీటిని పౌడర్ గా, శొంఠిగా , టీలలో వాడుతుంటారు. మార్కెట్ లో కిలో అల్లం ఎండు ముక్కలను 180 రూపాయల వరకు అమ్ముతూ.. సొసైటీ మంచి లాభాలను ఆర్జిస్తోంది.