Seed Selection Process : సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. విత్తన సేకరణలో జాగ్రత్తలు

విత్తన సంచులపై వున్న సమాచారాన్ని పూర్తిగా చదివి, వాటియొక్క జన్యు, భౌతిక స్వచ్చత వివరాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా విత్తనం మొలకెత్తకపోవడం, పంటను తెగుళ్లు, చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం తప్పదని  మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్  డా. రాజేశ్వర్ నాయక్ హెచ్చరిస్తున్నారు.

Seed Selection Process : సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. విత్తన సేకరణలో జాగ్రత్తలు

Seed Selection Process :

Updated On : July 11, 2023 / 6:14 AM IST

Seed Selection Process : ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు విత్తనాలను సేకరిస్తున్నారు. అడపా దడపా కురిసిన తొలకరి వర్షాలకు అక్కడక్కడ పత్తిని విత్తుతుండగా, మరొకొంత మంది విత్తనసేకరణలో ఉన్నారు. రైతులు ఇప్పటినుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెళకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా వుంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా వుండేది. అందుకే  విత్తనాల సేకరణలో రైతులు ఏయే అంశాలను దృష్ఠిలో వుంచుకోవాలి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.

READ ALSO : Paddy Cultivation : ఖరీఫ్ లో వరి వెదజల్లే పద్ధతికే మొగ్గుచూపుతున్న రైతులు

అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో కీలకం. ముందుగా.. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగుచేయబోయే పంటలో ఏయే రకాలు అందుబాటులో వున్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి.

READ ALSO : Intercropping in Coconut Plantation : కొబ్బరితోటలో అంతర పంటగా తోటకూర సాగు

విత్తన సంచులపై వున్న సమాచారాన్ని పూర్తిగా చదివి, వాటియొక్క జన్యు, భౌతిక స్వచ్చత వివరాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా విత్తనం మొలకెత్తకపోవడం, పంటను తెగుళ్లు, చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం తప్పదని  మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్  డా. రాజేశ్వర్ నాయక్ హెచ్చరిస్తున్నారు.

READ ALSO : Papaya Cultivation : బొప్పాయిసాగుకు అనువైన రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

వరి లాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3మిల్లీ లీటర్ల గాఢనత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24గంటలు నానబెట్టి, మరొక 24గంటల పాటు మండెకట్టాలి. విత్తేముందు శిలీంధ్రనాశనులతో విత్తనశుద్ధి చేసినట్లయితే.. భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ళను అరికట్టిన వాళ్ళమవుతాం.