Intercropping in Coconut Plantation : కొబ్బరితోటలో అంతర పంటగా తోటకూర సాగు

కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూరను సాగుచేస్తున్నారు. దఫ దఫాలుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చేలా సాగుచేస్తూ.. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

Intercropping in Coconut Plantation : కొబ్బరితోటలో అంతర పంటగా తోటకూర సాగు

Intercropping in Coconut Plantation

Updated On : July 11, 2023 / 5:49 AM IST

Intercropping in Coconut Plantation : పోషక ఆహారంపై పెరిగిన అవగాహనతో ఆకుకూరల వినియోగం పెరిగింది. ఆకు కూరల్లో మనకు కావల్సిన లవణాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దఫ దఫాలుగా ఆకుకూరలు విత్తుకుంటూ.. ఏడాది పొడవునా.. ఆదాయాన్ని తీసుకుంటూ.. లాభాల బాటలో పయనిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

READ ALSO : Cocoa Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగు.. ఏడాదికి రూ. 10 లక్షల ఆదాయం

కొబ్బరి చెట్ల మధ్యలో రైతు వెంకన్నబాబు తోటకూర సాగు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, బల్లిపాడు గ్రామానికి చెందిన ఈయన తనకున్న కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూరను సాగుచేస్తున్నారు. దఫ దఫాలుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చేలా సాగుచేస్తూ.. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.