Cultivation Of Grapes : ద్రాక్ష సాగులో రైతులు పాటించాల్సిన మెలుకువలు!

సంవత్సరానికి 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో, శీతాకాలంలో, కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించటం వల్ల ఎక్కువగా కొత్త కొమ్మలు వస్తాయి.

Cultivation Of Grapes : ద్రాక్ష సాగులో రైతులు పాటించాల్సిన మెలుకువలు!

Farmers to follow in the cultivation of grapes!

Updated On : November 14, 2022 / 6:07 PM IST

Cultivation Of Grapes : ద్రాక్ష పోషకాలతో నిండి ఉన్న పండు కావటంతో మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు కొన్ని వాతావరణ పరిస్ధితుల్లోనే ద్రాక్షను సాగుచేస్తుండగా, కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు. లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొమ్మలు కత్తిరింపు కీలకం ; కొమ్మల కత్తిరింపుతో ద్రాక్ష త్వరగా కాపుకువస్తుంది. తీగను సరిగా ప్రాకించకపోయినా, కత్తిరించకపోయినా ద్రాక్ష పంట దిగుబడి రాదు.  సంవత్సరానికి 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో, శీతాకాలంలో, కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించటం వల్ల ఎక్కువగా కొత్త కొమ్మలు వస్తాయి. ద్రాక్ష గుత్తుల పరిమాణం , నాణ్యత పెంచటానికి జిబ్బరిల్లిక్ ఆసిడ్ అను హార్మోన్ ను పైరుపై పిచికారి చేయాలి. గుత్తులను పిందె పడిన వెంటనే 50-60 పీపీఎం జీఎ, ద్రావణంలో ఉంటం వల్ల 30-50% వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది..

ద్రాక్ష పండ్ల కోత విషయంలో ; సాధారణంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తీయగా ఉన్న గుత్తి కోతకు వచ్చినట్లు గుర్తించవలెను. తెల్లని ద్రాక్ష బాగా తయారైనపుడు అంబర్ రంగులోకి మారుతుంది. అలాగే రంగు ద్రాక్షలాగా రంగువచ్చి పైన బూడిదవంటి పొడితో సమానంగా కప్పబడినట్లుగా కనబడుతుంది. పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి. పండ్ల లో మొత్తం కరిగే ఘనపదార్థాలు కూడా పండు పరిపక్వాన్ని సూచిక. ద్రాక్ష దిగుబడి అన్నది నేల మరియు ఇతర వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో అనబి-ఇ-షాహి 10-15 టన్నులు/ఎకరానికి దిగుబడి వస్తుండగా, థామ్సన్ సీడ్స్ 6-8 టన్నులు ఎకరానికి దిగుబడి ఇస్తుంది.