Green Manure : పచ్చిరొట్ట పైర్లు దున్నే సమయం.. ఉత్తరకోస్తాలో ఊపందుకున్న వరినాట్లు

Green Manure : అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడిపంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి.

Green Manure Cultivation

Green Manure : తెలంగాణలో వరినాట్లు పూర్తయ్యాయి. వివిధ దశలో పైర్లు ఉన్నాయి.  ఆంద్రప్రదేశ్ లో మాత్రం ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు రైతులు. అయితే వరిసాగుచేసే రైతులు ముందస్తుగా పచ్చిరొట్ట పైర్ల పెంపకం చేపట్టారు. ఆ పైర్లను ఏసమయంలో పొలంలో కలియదున్నాలి..? అనంతరం ఎప్పుడు వరినాట్లు వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ.

Read Also : Paddy Crop Cultivation : వరి గట్లపై.. లాభాల బాట

అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడిపంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి, పంటలో సూక్ష్మపోషకాల లోపాలు బయటపడుతున్నాయి.

ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.

ఈ పంటలను పొలాల్లో పెంచి, నేలలోనే కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. కలుపు నివారణతో పాట అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంది. అందుకే చాలామంది రైతులు వరిసాగుకు ముదు పచ్చిరొట్ట పైర్లను సాగుచేశారు. అయితే వాటిని ఎప్పుడు పొలంలో కలియదున్నాలి.. వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నయో  తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ.

Read Also : Paddy Farming : వరిలో పురుగుల నివారణ..