Paddy Farming : వరిలో పురుగుల నివారణ..
Paddy Farming : ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరిపైరులో కాండంతోలుచు , ఉల్లికోడు, సుడిదోమ ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలాచోట్ల వరిపైరులో ఈ పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

pest control in rice farming techniques in telugu
Paddy Farming : ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో.. వరినాట్లు కూడా.. కొన్ని చోట్ల ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం చాలా చోట్ల పిలక చేసే దశ నుండి దుబ్బుచేసే వరకు వరిపైరు ఉంది. అయితే ఈ సమయంలో రకరకాల పురుగులు ఆశించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు . వీటిని గమనించిన వెంటనే సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని.. సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామగోపాల్ వర్మ.
ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరిపైరులో కాండంతోలుచు , ఉల్లికోడు, సుడిదోమ ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలాచోట్ల వరిపైరులో ఈ పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కలపురుగు గోధుమ రంగులో వుండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి వుంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై, తన రెక్కల నూగును కప్పివుంచుతుంది.
5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగు జేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20-30 శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుంది.
అలాగే సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం . అలాగే పిలక దశలో ఉల్లికోడు ఆశించి తీవ్రనష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పురుగులు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వేళ పురుగులు ఆశించనట్లు గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ.. రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామగోపాల్ వర్మ.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు