Ground Nut Farming : వేరుశనగలో ప్రస్తుతం చేపట్టే యాజమాన్యం

Ground Nut Farming : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది.  రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు.

Ground Nut Farming

Ground Nut Farming : నూనెగింజల పంటల్లో ప్రధానమైనపంట వేరుశనగ. ముఖ్యంగా  ఈ పంటను యాసంగిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాలో  అధికంగా సాగుచేస్తుంటారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. వేరుశనగలో ముఖ్యంగా  పూత దశ, గింజకట్టే దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చీడపీడలు పంటకు ప్రధాన సమస్యగా మారతాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ తెలియజేస్తున్నారు, కరీనంగర్ జిల్లా  పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. రేవతి.

Read Also : Sugarcane Cultivation : చెరకు సాగులో మేలైన యాజమాన్యం

 అధిక దిగుబడులకోసం చేపట్టాల్సిన యాజమాన్యం :
తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది.  రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదుచేస్తున్నారు.

తేలిక నేలలు ఎర్రచల్కానేలల్లో రైతులు వేరుశనగ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఒక్క తెలంగాణలోనే 2 లక్షల హెక్టార్లలోల వేరుశనగ సాగవుతోంది. ప్రస్తుతం పూత , పిందె దశలో ఉంది. ఈ సమయంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం  చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు.

వేరుశనగ విత్తిన 30 నుంచి 35 రోజులకు పూత సమయం వస్తుంది. ఈ సమయంలో సూక్ష్మదాతు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతాయి. రైతులు సమగ్ర యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు..

వేరుశనగను మొదటి నుంచీ పలు విధాల చీడపీడలు ఆశిస్తుండటం పరిపాటి. విత్తన శుద్ధి నుంచీ పంట చివరి దశ వరకు ఆయా పురుగులు, తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక, దిగుబడులూ గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతుంటారు.

Read Also : Vegetable Cultivation : వేసవి బీరసాగులో మేలైన యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు