Vegetable Cultivation : వేసవి బీరసాగులో మేలైన యాజమాన్యం

Vegetable Cultivation : పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్ తో పనిలేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు .

Vegetable Cultivation : వేసవి బీరసాగులో మేలైన యాజమాన్యం

Vegetable Cultivation

Vegetable Cultivation : కూరగాయల సాగు.. రైతులకు ప్రతిరోజూ ఆదాయం తెచ్చిపెడుతున్నది. వ్యాపారులు, ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తున్నది. అలాంటి కూరగాయల పంటలలో.. బీర ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తున్నది. అంతేకాకుండా, ఈ కూరగాయకు మార్కెట్‌లో 365 రోజులూ మంచి డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి వేసవిలో పందిరి విధానంలో సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. అయితే వేసవి బీరసాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్ తో పనిలేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు . ముఖ్యంగా పందిరిజాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 15 నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటను క్లార , ఆమ్ల గుణాలున్న నేలలు తప్పా అన్ని రకాల నేలల్లో సాగుచేసుకోవచ్చు.

విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి :
కిలో విత్తనానికి థైరమ్ 3 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల చొప్పున ఒక దాని తరువాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనాకి 2 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తన శుద్ధి చేయాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను తక్కువ దూరంలో నాటుకోని , మొక్కల సాంద్రత పెంచితే, విడిగా మొక్క దిగుబడి తగ్గినప్పటికీ, ఎక్కువ మొక్కలుండటం వల్ల విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది.

ఇందుకోసం విత్తన మోతాదును పెంచాలి. విత్తేముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు, పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయకూడదు. ఎరువును వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి.

ఆడపుష్పాల కోసం బోరాక్స్ పిచికారి చేయాలి : 
కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 నీటి తడుల తర్వాత మట్టిని గుళ్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మి. లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు నేలకు పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది.

గింజ విత్తేముందు పొలంలో నీరు పెట్టాలి. ఆతరువాత ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తరువాత పాదుచుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకొకసారి నీరు ఇవ్వాలి. రకాన్ని బట్టి బీరకాయలు నాటిన 60 నుండి 90 రోజులలో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోయాలి. కాయలు ముదిరిపోకుండా 2 నుండి 3 రోజుల వ్యవధిలో కోయాలి. కాయలు ముదిరనట్లయితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్ కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి.

Read Also : Paddy Cultivation : రబీ వరిసాగు యాజమాన్యం.. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు