Rabi Sesame Cultivation : రబీ నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

Rabi Sesamum Cultivation : నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.  జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుకోవచ్చు.

Rabi Sesame Cultivation : రబీ నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

Rabi Sesamum Cultivation

Rabi Sesame Cultivation  : రైతులు రబీలో నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో పంటకు సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి. అయితే రైతులు విత్తన ఎంపిక.. సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వుల దిగుబడి ఆధారపడి వుంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్.

Read Also : Sesame Cultivation : నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

ఖరీఫ్‌ వరి పంట చేతికొచ్చిన తర్వాత రైతులు రబీ సాగు చేపడతారు. కోతలు పూర్తవగానే నీటి తడులు, అదను చూసి అపరాలు, నువ్వులు, వేరుశనగ, జనుము వంటి వాటిని వేస్తారు. అయితే అతితక్కువ సమయం.. అతి తక్కువ ఖర్చుతో.. అధిక లాభాలు వచ్చే పంట నువ్వు.

అందుకే వేసవిలో రెండు మూడు నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వుల పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.  జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుకోవచ్చు.

అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు :
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది.  నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో నువ్వులు క్వింటా 10 వేల పైనే ధర పలుకుతుంది.

ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక.. సమయానుకూలంగా పాటించే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడి ఆదారపడి ఉంటుందిన సాగు యాజమాన్యం తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా , ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్.

నువ్వు పంటలో కలుపు నివారణ ముఖ్యం. ఈ పంటకు చీడపీడల బెడద తక్కువగానే ఉన్నా.. వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారి చేసి నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం..

Read Also : Mango Cultivation : ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ