Mango Cultivation : ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ

Mango Cultivation : వర్షపాతం అధికంగా వుండే ప్రాంతాల్లో ఆగష్టు సెప్టెంబరు నుండి మామిడి తోటల పునరుద్దరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో  కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి.

Mango Cultivation : ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ

Mango Cultivation

Mango Cultivation : పండ్లతోటల్లో రాజు మామిడి. పదికాలాలపాటు ఫలసాయం అందించే మామిడిలో ప్రస్థుతం రైతులు  ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కాపు తగ్గిపోవటం. 30 ఏళ్లు పైబడిన తోటల్లో కాపు నిలకడగా లేకపోవటం, కొమ్మలు విస్తారంగా వ్యాపించి దట్టంగా అలుముకోవటం వల్ల చీడపీడలు అధికంగా వుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలనుండి రైతులను గట్టెక్కించేందుకు మంచిర్యాల జిల్లా ఉద్యానశాఖ అధికారులు చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగానే వయసుమీదపడిన మామిడి తోటలకు పునరుద్దరణ ప్రక్రియ ద్వారా పునర్జీవం కల్పిస్తున్నారు.

Read Also : Bananna Cultivation : ఆయిల్ ఫాంలో అంతర పంటగా అరటి సాగు

సాధారణంగా 30-40 సంవత్సరాల పైబడిన మామిడి తోటల్లో చెట్లు ఎత్తు ఎక్కువ పెరగటం వల్ల రైతుకు కాయకోత, సస్యరక్షణ వంటి పనులు క్లిష్టంగా మారతాయి. పైగా చెట్లు వయసు మీరే కొద్దీ కాపు తగ్గిపోవటం జరుగుతుంది. వీటిని తీసేసి  కొత్త మొక్కలు నాటాలంటే, తిరిగి 6-7సంవత్సరాలుకు గాని మామిడి సాగు నుండి లాభాలు రావు.

టాప్ వర్కింగ్ వల్ల చెట్లకు పూర్వవైభవం : 
దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది రెజోవనేషన్ ప్రక్రియ. దీన్ని మామిడి చెట్ల పునరుద్ధరణ అంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు వున్నందున, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి లోని కన్నాల ఉద్యాన నర్సరీలోని 25 ఎకరాల్లో ఉన్న 500 మామిడి చెట్లను పునరుద్దరణ ద్వారా పునర్జీవం కల్పించారు. దీంతో ముదురు మామిడితోటలు , తిరిగి కొమ్మలతో అభివృద్ది చెందుతున్నాయి.

వర్షపాతం అధికంగా వుండే ప్రాంతాల్లో ఆగష్టు సెప్టెంబరు నుండి మామిడి తోటల పునరుద్దరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో  కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి. దీనివల్ల వర్షపు నీరు కొమ్మలపై నిలవకుండా వుండి, బూజు తెగుళ్ల సమస్య తగ్గుతుంది. కొమ్మలు కత్తిరించిన వెంటనే బోర్డోపేస్టు లేదా బ్లైటాక్స్ ద్రావణం పూయాలి.

కత్తిరించిన కొమ్మల నుంచి 4 నెలల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. ఎక్కువ కొమ్మలు వచ్చినట్లయితే ప్రతీ కాండానికి 3 లేదా 4 కొమ్మలు మాత్రమే వుంచి మిగతా వాటిని తీసేయాలి. కొత్త కొమ్మలకు అంటు కట్టటం ద్వారా కొత్త మామిడి రకాలను కూడా  అభివృద్ధి చేసుకోవచ్చు. అయితే చెట్టు నూతన జవసత్వాలు పొందేందుకు, పోషకాలు, నీటి యాజమాన్యంలో తగిన శ్రద్ధ వహించాలి.

Read Also : Sorghum Cultivation : జొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు