Sugarcane Cultivation : చెరకు సాగులో మేలైన యాజమాన్యం

Sugarcane Cultivation : కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు.

Sugarcane Cultivation : చెరకు సాగులో మేలైన యాజమాన్యం

Sugarcane Cultivation

Sugarcane Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్థుతం చెరకు నాటే సమయం ఆసన్నమయ్యింది. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నాటుతుండగా, మరికొన్ని చోట్ల చెరకు నరుకుతున్నారు. ఇంకొన్ని చోట్ల కార్శితోటలను రైతులు సిద్ధం చేస్తున్నారు. చెరకుసాగులో రైతు ఏడాదికాలంపాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి వుంది. కనుక నాటే సమయం, కార్శీసమయంలో తగిన మెళకువలు పాటించి, యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలను కృష్ణా జిల్లా, ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్ర్రవేత్త డా. సుధారాణి, ద్వారా తెలుసుకుందాం.

Read Also : Sorghum Cultivation : జొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు

చెరకు సాగుకు సిద్ధమవుతున్న రైతులు : 
తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగువుతుండగా, తెలంగాణలో లక్షా 50 వేల ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం వుంది. ప్రస్థుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు.

తెలంగాణలో జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. ప్రస్థుతం కొంతమంది రైతులు వరిమాగాణుల్లో ముందస్తుగా నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.  చెరకులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు అందుబాటులో వున్నాయి.  రైతులు మేలైన రకాలను ఎంచుకుని నాటుకోవాలి. అయితే చెరకు మొక్కతోట నాటేటప్పుడు యాజమాన్యంలో రాజీపడకుండా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.  సుధారాణి.

చెరకు తోటలకు  బాల్యదశ నుండే చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీక పురుగుగా మొదటి దశలోనే ఆశిస్తుంది. ఇది మొక్క మొవ్వుల్లో చేరి తీవ్రనష్టం కలిగిస్తోంది. తరువాతి దశల్లో కాండం తొలుచు పురుగుగా రూపాంతరం చెందుతుంది. చెరకు గడలకు రంధ్రాలు చేసి, లోపలి కణజాలాన్ని తినేయటం వల్ల, దిగుబడికి అపార నష్టం వాటిల్లుతుంది. కాబట్టి రైతులు చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. సమగ్ర సస్యరక్షణ చక్యలు చేపట్టాలి.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వుసాగులో మేలైన యాజమాన్యం