Ground Nut Cultivation : వేరుశనగ కోతలో పాటించాల్సిన జాగ్రత్తలు.. ఏ మాత్రం తేడా వచ్చినా దిగుబడికి నష్టమే!

Ground Nut Cultivation : తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాలలో దీని సాగు ఎక్కువగా వుంది.

Ground Nut Cultivation

యాసంగిలో ఆరుతడి పంటగా సాగుచేసిన వేరుశనగ మరో నెలరెరోజుల్లో కోతకు రానుంది. అయితే వేరుశనగను సరైన పక్వదశలో గుర్తించి, తీతలు జరపాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఎకరానికి 3-4 బస్తాల దిగుబడి నష్టపోయే ప్రమాదం వుంది.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

మొక్కలు పీకేటప్పుడు నేల గుల్లగా వుండేటట్లు చూసుకోవటం, కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగుళ్లు రాకుండా చూసుకోవటం, ఎంతైన అవసరం. వేరుశనగ పక్వదశను గుర్తించే విధానం, నిల్వలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాలలో దీని సాగు ఎక్కువగా వుంది. తెలంగాణలో యాసంగిలో కొంత విస్తీర్ణంలో రైతులు సాగుచేశారు. ప్రస్థుతం గింజలు గట్టిపడే దశలో ఉన్నాయి.  ముఖ్యంగా 70 నుండి  80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపుగా మారినప్పుడు పంటను కోయాలి.

కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేవిధంగా చూసుకోవాలి. కూలీల కొరత ఉన్న నేపధ్యంలో , భూమినుండి మొక్కలను తీయడానికి ట్రాక్టరుతో నడిచే యంత్రాలను ఉపయోగించి పంట కోత కోయాలి. సాగు ఆసాంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతులు .. తీతల సమయంలో కూడా కొన్ని మెలకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు