Alasanda Cultivation : అలసంద సాగులో పంటకోత.. కోత అనంతరం జాగ్రత్తలు !
బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రిం 20 మి.లీ. మలాథియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి.
alasanda
Alasanda Cultivation : అలసందలు తెలుగు రాష్ట్రాల్లో వర్షాదారంగా సాగయ్యే పంట. వర్షాలు పడటం ఆలస్యమైనప్పుడు నేలలో ఉన్న మిగులు తేమను ఉపయోగించుకుని చాలా మంది అలసంద పంటను సాగు చేస్తుంటారు. వేడితో కూడిన వాతావరణంలో అలసంద పంట దిగుబడి బాగా వస్తుంది. చలి వాతావరణాన్ని తట్టుకోలేదు. ఈ పంట వేయటానికి ఖరీఫ్, రబీ, వేసవి కాలాలు అనుకూలంగా ఉంటాయి. జులై, సెప్టెంబర్, ఫిబ్రవరిలో పంట విత్తుకోవచ్చు.
READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం
అలసంద పంట కోత:
అలసందలు పచ్చి కాయలకు, విత్తనం కోసం పండిస్తుంటారు. పచ్చి కాయల కోసం పండించినప్పుడు 45 రోజుల నుండి కాయలు కోతకు సిద్ధంగా వుంటాయి. వచ్చి కాయల నార ఎక్కువగా తయారవక ముందే కోసినచో నాణ్యత కలిగి కూరగాయలుగా ఎక్కువ గిరాకీ ఉంటుంది. ప్రతి రెండు మూడు రోజులకు కోయవచ్చు. సుమారు 30-40 క్వింటాళ్ళు ప్రతి ఎకరానికి పచ్చి కాయల దిగుబడి వస్తుంది..
విత్తనంగా పండించినవ్పుడు రకం యొక్క కాలాన్ని బట్టి 80-100 రోజులకు కాయలు తయారవుతాయి. ఆకు పచ్చని రంగు నుండి పసుపు రంగుకు క్రమేపి ఎండు, గడ్డి రంగుకు మారి ఎండిపోతాయి. అకులు కూడా క్రమేపి ఎండిపోయి క్రింది రాలి పోతాయి. 80-90% వరకు కాయలు తయారైన తర్వాత కొడవలితో మొక్క మొదలు వరకు కోయాలి. పొడి వాతావరణంలో పంటను కోస్తే పంట నాణ్యత బాగా వుండును.
READ ALSO : Mango Planting : మామిడి మొక్కలు నాటటానికి అనువైన కాలం, నాటిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కోతానంతర జాగ్రత్తలు:
కోసిన పంటను ౩-4 రోజుల వరకు పంట చేలో గాని లేదా కల్లెంపై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్‌తో తొక్కించి లేదా ఆల్ క్రాప్ త్రెషరను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి 2-3 రోజులు బాగా ఎండనిచ్చి గింజలలో తేమ 9 శాతం కన్నా మించకుండా చూసుకొని నిల్వచేయవలెను.
బాగా ఎండిన గింజలు (8-9 తేమ శాతం) గోనె సంచులలో గాని, పాలిథీన్ సంచులలో గాని నిల్వ చేయవచ్చును. నిల్వ చేసే ముందు సాధనాలను గోనె సంచులు శుభ్రపర్చుకోవాలి. గోనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి లేదా సంచులపై మలాథియాన్ 10 మి.లీ. లేదా డెల్దామెత్రిన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి.
READ ALSO : Turmeric Cultivation : పసుపుసాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు
బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రిం 20 మి.లీ. మలాథియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. దీర్హకాల నిల్వ చేసినప్పుడు ఎప్పటికప్పుడు గమనించి అవసరం మేరకు అప్పుడప్పుడు ఎండబెట్టి నిల్వ చేయాలి.
గృహ అవనరాలకై కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంటనూనెలు లేదా ఆముదం నూనె లేదా వేప నూనె ప్రతి కిలో గింజలకు 5.0 మి.లీ. చొప్పున కలిపి నిల్వ చేసినచో నిల్వలో పురుగుల వలన నష్టం జరుగకుండా నివారించవచ్చును. గ్రుడ్లు పొదగకుండా నివారించటం వల్ల, లార్వా గింజలలోకి చొరబడక ముందే చని పోవడానికి దోహదపడుతుంది.
