Cultivation of Broccoli : బ్రకోలీ సాగు తో అధిక ఆదాయం పొందుతున్న రైతులు.. ఎక్కడంటే ?
హోసూరు, రామనాథపురం, చప్పరదహళ్లి, జల్లిగె, బసవనపురం, చన్నరాయపట్టణ హోబలి తదితర ప్రాంతాల్లో రైతులు ఏకంగా 100 హెక్టార్లలో బ్రోకలీ సాగుకు చేపట్టారు. ఉద్యానవన శాఖ అధికారుల చొరవ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా బ్రోకలీని విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేసే స్దాయి పంటగా నిలబెట్టింది.

broccoli cultivation
Cultivation of Broccoli : కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకాలోని రైతులు విదేశీ బ్రకోలీ సాగు ద్వారా అధిక అదాయం గడిస్తున్నారు. ప్రధానంగా ఎచినోసిన్ రకం బ్రకోలీని సాగుచేస్తున్నారు. ఎందుకంటే దీని పంట ఉత్పత్తి వ్యవధి చాలా తక్కువగా ఉండటంతో గ్రామీణ రైతుల నుండి ఇది మంచి ప్రజాదరణ పొందింది. ఇటీవలి కాలంలో బ్రోకలీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగుతున్నాయన్న నిపుణుల సూచనలతో అది బాగా ప్రసిద్ధి గాంచింది. ముఖ్యంగా కాల్షియం యొక్క అధిక కంటెంట్, బీటా-కెరోటిన్ కలిగిఉండటంతోపాటు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది దీనిలో లభిస్తుంది. రక్త ప్రసరణ , గుండె ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉండటంతో దీని వినియోగం బాగా పెరిగింది. దీంతో స్థానిక రైతులు ఈ పంట సాగును చేపట్టారు.
READ ALSO : Rose Cultivation : గులాబీ సాగులో మెళుకువలు, కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడి!
ఒక ఎకరం భూమితో, రైతులు ఎకరాకు 15 నుండి 20 టన్నుల దిగుబడిని పొందవచ్చు. బ్రోకలీని పండించడానికి అనువైన ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. దీంతో కర్ణాటకలోని దేవనహళ్లి తాలూకాలోని రైతులకు అనుకూలమైన పంటగా మారింది. లాభసాటిగా వస్తుండడంతో స్థానిక రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.
బసవనపురానికి చెందిన అభిలాష్ అనే రైతు 7 నుండి 8 ఎకరాల భూమిలో బ్రోకలీ సాగు చేపట్టాడు. కనీస ఖర్చులు , తెగుళ్ళకు నిరోధక ఖర్చులు పోను ఆకర్షణీయమైన అదాయం లభిస్తుంది. ఎకరానికి రోజుకు 300 నుండి 400 రూపాయల ఆదాయం చేతికి వస్తుంది.
ఆర్థిక ప్రయోజనాలతో పాటు, బెంగుళూరు రూరల్ జిల్లాలోని ఉద్యానవన శాఖ రైతులకు నైపుణ్యం అందించటంతోపాటు, ఆర్థిక సహాయంతో మద్దతునిస్తోంది, బ్రోకలీ సాగు వైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తుంది. పంట నాణ్యత బాగా ఉండటం, అదే క్రమంలో బెంగళూరు సిటీ మార్కెట్‌కు సమీపంలో ఉండటం వల్ల రైతులకు లాభదాయకంగా దోహదపడుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
READ ALSO : Onion Cultivation : ఉల్లి గడ్డ సాగుకు అనువైన రకాలు..
హోసూరు, రామనాథపురం, చప్పరదహళ్లి, జల్లిగె, బసవనపురం, చన్నరాయపట్టణ హోబలి తదితర ప్రాంతాల్లో రైతులు ఏకంగా 100 హెక్టార్లలో బ్రోకలీ సాగుకు చేపట్టారు. ఉద్యానవన శాఖ అధికారుల చొరవ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా బ్రోకలీని విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేసే స్దాయి పంటగా నిలబెట్టింది.
ఉద్యానవన శాఖ నీటిపారుదల పద్ధతులను ప్రోత్సహించడం, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడంతో, దేవనహళ్లి తాలూకాలో బ్రోకలీ సాగు నానాటికి విస్తార్తంగా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. రైతులు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సహకారం వ్యవసాయవిధానాలను మార్చడంలో , గ్రామీణ రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో ప్రత్యామ్నాయ పంటల సామర్థ్యాన్నిపెంచటంలో తోడ్పడుతున్నాయి.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
బ్రోకలీ అనేది ఒక కూరగాయ. ఇది అడవి జాతి క్యాబేజీ. పోషకాహార పరంగా దీనిని తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో విటమిన్లు C, B మరియు K, పొటాషియం, ఇనుముతోపాటు ప్రోటీన్, కొవ్వులు ఉంటాయి. బ్రోకలీని ఇప్ప్పటికే భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు,ఉత్తరాఖండ్‌లలో రైతులు పండిస్తున్నారు.