Finger Millet Cultivation
Finger Millet Cultivation :చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో ఈ పంటలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. మార్కెట్ గిరాకీ, పెరిగిన గిట్టుబాటు ధరలతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జులై నుండి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఈ పంటలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పెరుమాళ్ల పల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్ర్తవేత్త డా. మాధవిలత.
READ ALSO : Green Gram Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా పెసర సాగుతో మంచి ఆదాయం
చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైధ్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని.. తైదలు, చోడిగా పిలుస్తుంటారు. రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
READ ALSO : Millets Rice : పౌష్టికాహార లోప నివారణే ధ్యేయంగా ఐఐఎంఆర్.. చిరుధాన్యాలతో బియ్యం తయారుచేస్తున్న సంస్థ
రాగిలో ఉండే పోషకవిలువలే దీనికి గల ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. వీటిని సంకటి, అన్నం, జావ తయారీతోపాటు, తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు, హైటోకేమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరస్ధాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి గ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్ఠమైన ఆహారం.
READ ALSO : Sorghum Cultivation : జొన్న సాగులో మేలైన యాజమాన్యం
ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకుంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్ లో రాగి పంటను జులై మొదటి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పెరుమాళ్ల పల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్ర్తవేత్త డా . మాధవి లత.
READ ALSO : Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు గోధమ రొట్టెలకంటే, జొన్న, రాగి రొట్టెలు తినటం మంచిదా?
రాగిని తెలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు , కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగుచేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవి కావు. ముఖ్యంగా సరైన సాంద్రతలో మొక్కల పెట్టినట్లైతే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. నేరుగా విత్తే పద్ధతితో పాటు నారుపోసి నాటు వేసుకునే పద్ధతిలో కలుపు యాజమాన్యం ముఖ్యం. సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు కలుపును నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు.
READ ALSO : Warm Jaggery Water : చలికాలంలో ఖాళీ కడుపుతో గోరువెచ్చని బెల్లం నీరు త్రాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!
రాగి సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే . ఎకరాకు 4 టన్నుల పశుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. అంతే కాకుండా సమయానుకూలంగానత్రజని, భాస్వరం, పొటాష్ ను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. ఎకరాకు పెట్టుబడి 10 నుండి 15 వేలు అవుతాయి. దిగుబడి 18 క్వింటాల వరకు వస్తుంది. మార్కెట్ లో క్వింటాలు ధర రూ. 3, 150 పలుకుతోంది. ఖర్చులు పోను రైతుకు రూ. 40 వేల వరకు నికర లాభం వస్తుంది.