Green Gram Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా పెసర సాగుతో మంచి ఆదాయం

పెసరసాగులో కలుపు నివారణ కూడా కీలకమే . పంట మొలకెత్తక ముందు, మొలకెత్తిన  తరువాత  కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారి చేసి నివారించాలి. తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. సాధారణంగా పెసరను వర్షాధారంగా పండిస్తారు.

Green Gram Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా పెసర సాగుతో మంచి ఆదాయం

Green Gram Cultivation

Updated On : July 23, 2023 / 10:17 AM IST

Green Gram Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతోపాటు  రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది . ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు భూములను సిద్ధంచేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. మార్కెట్ లో పెసరకు మంచి ధర పలుకుతుండటంతో ఈ పంట సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే పెసర సాగులో అధిక దిగుబడుల కోసం రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం  శాస్త్రవేత్త డా. పల్లవి .

READ ALSO : Millets Rice : పౌష్టికాహార లోప నివారణే ధ్యేయంగా ఐఐఎంఆర్.. చిరుధాన్యాలతో బియ్యం తయారుచేస్తున్న సంస్థ

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోను, సెప్టెంబరు, అక్టోబరులో రబీపంటలు సాగుచేసే రైతాంగానికి ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోను, కృష్ణా గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు.

READ ALSO : Sorghum Cultivation : జొన్న సాగులో మేలైన యాజమాన్యం

ప్రస్తుతం అడపాదడప కురుస్తున్న వర్షాలకు భూములను సిద్ధంచేసుకుంటూ  పెసర సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపధ్యంలో సాగు వివరాలను తెలియజేస్తున్నారు  వరంగల్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం  శాస్త్రవేత్త  డా. పల్లవి.

READ ALSO : Green Gram Cultivation : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

పెసరసాగులో కలుపు నివారణ కూడా కీలకమే . పంట మొలకెత్తక ముందు, మొలకెత్తిన  తరువాత  కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారి చేసి నివారించాలి. తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. సాధారణంగా పెసరను వర్షాధారంగా పండిస్తారు. ఒక వేళ బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఒకటి రెండు తడులు ఇచ్చుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి.