Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు గోధమ రొట్టెలకంటే, జొన్న, రాగి రొట్టెలు తినటం మంచిదా?

మధుమేహులకు గోధుమ రొట్టెల కంటే రాగిపిండితో చేసిన రొట్టెలే ఎంతో మేలు చేస్తాయి. ఈ రాగి రొట్టెలు కేవలం డయాబెటీస్ పేషెంట్లకే కాదు అధిక రక్తపోటు, ఊబకాయులకు కూడా మంచివి. రాగుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు గోధమ రొట్టెలకంటే, జొన్న, రాగి రొట్టెలు తినటం మంచిదా?

Diabetes :

Diabetes : మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మధుమేహం కారణంగా గుండె జబ్బులు, కిడ్నీలు మరియు ఊపిరితిత్తులు ప్రమాదానికి గురవుతాయి. డయాబెటిస్‌లో, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపినప్పుడు లేదా తగ్గించినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకుంటూ ఉండాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా మధుమేహులు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

మదుమేహులు షుగర్ నియంత్రణలో ఉంచుకునేందుకు అల్పాహారం ,రాత్రి భోజనంపై తగిన శ్రద్ధ పెట్టాలి. ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోవటం తప్పనిసరి చేసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేలా చేస్తాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బ్రెడ్ వంటి వాటిని వాల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా మధుమేహులు చాలా మంది గోధుమ పిండితో చేసిన రొట్టెలను తీసుకుంటుంటారు. అయితే గోధుమల్లో పై పొట్టును తొలగించిన తరువాత వచ్చే పిండిని ఉపయోగిస్తుంటారు. దీని వల్ల శరీరంలోకి కార్బోహైడ్రేట్లు అధికంగా చేరి చక్కెర స్ధాయిలు త్వరగా పెరుగుతాయి.

మధుమేహులు జొన్న రొట్టె తినటం మంచిదే ;

గోధుమ పిండి చపాతీతో పోలిస్తే జొన్నలుతో చేసిన రోటీని తీసుకోవడం మంచిది. జొన్నలోని అధిక ఆహారపు ఫైబర్ జీర్ణక్రియ, హార్మోన్ల మరియు కార్డియో-వాస్కులర్ ఆరోగ్యానికి మాత్రమే కాక, జొన్న గ్లైసెమిక్ సూచికను కూడా తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ విడుదలకు ఎక్కువ సమయం పడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను నివారించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే, భోజనంతో పాటు జొన్న పిండి బ్రెడ్ లు తినటం మంచిది.

జొన్నలు ప్రొటీన్, ఐరన్, విటమిన్ బి, డైటరీ ఫైబర్ మరియు టానిన్లు మరియు ఆంథోసైనిన్ వంటి యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. ఈ యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. గ్లూటెన్ రహితంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం కాబట్టి ఇది మంచి ధాన్యంగా చెప్పవచ్చు. కొన్ని రకాల్లో అధిక ఫినాలిక్ కంటెంట్ ఉంటుంది, ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

రాగి పిండి రొట్టె తినండి:

మధుమేహులకు గోధుమ రొట్టెల కంటే రాగిపిండితో చేసిన రొట్టెలే ఎంతో మేలు చేస్తాయి. ఈ రాగి రొట్టెలు కేవలం డయాబెటీస్ పేషెంట్లకే కాదు అధిక రక్తపోటు, ఊబకాయులకు కూడా మంచివి. రాగుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహార పదార్థాలను తొందరగా అరిగేలా చేస్తుంది. రాగులు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడతాయి. వీటిని తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

రాగుల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి. రాగులు ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి. అలాగే శరీరంలో రక్తహీనత సమస్యను కూడా తొలగిస్తాయి. రాగులను తరచుగా తింటే శరీరంలో రక్తానికి కొదవ ఉండదు. రాగులతో రొట్టెలు, దోశలు , స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.