Jasmine Farming : అన్ సీజన్‌లో మల్లె పూల దిగుబడులు – అధిక ధరతో ఆనందంలో రైతులు
Jasmine Farming : మల్లె పువ్వును ఇష్టపడని మగువలు వుండరు. ప్రధానంగా ఈ తోటలు వేసవిలో అధిక పూల దిగుబడినివ్వటంతో రైతులతోపాటు, కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తుంది.

Huge Profits Earning Jasmine Farming
Jasmine Farming : కొన్ని రకాల పుష్పాలు కేవలం ఆకట్టుకోగలవు. మరికొన్ని రకాల పూలు సువాసనలతో మనసు దోచుకోగలవు. కానీ మనిషి మనసుకు ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సుగంధ పువ్వు మల్లె. అందుకే దీన్ని పుష్పాల రాణిగా పరిగణిస్తారు. మండు వేసవిలో విరగపూసే మల్లె రైతుకు లాభాలను అందించే పంటగా పేరుగాంచింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు గుండుమల్లెలను సాగుచేసి.. లాబాలను పొందేందుకు సిద్ధమవుతున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే. కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. సాయంత్రంపూట మొగ్గలను తెంపి, కొన్ని మొగ్గలను మాలలు కట్టి, తడి గుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి.
మల్లె పువ్వును ఇష్టపడని మగువలు వుండరు. ప్రధానంగా ఈ తోటలు వేసవిలో అధిక పూల దిగుబడినివ్వటంతో రైతులతోపాటు, కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఈ తోటలను పావు ఎకరం నుండి 2 ఎకరాల వరకు సాగుచేస్తున్నారు.
ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, చిన్నతాడేపల్లి గ్రామానికి చెందిన రైతు పిచ్చుకల వెంకటనారాయణ గత ఏడాది సెంప్టెంబర్ నెలలో తనకున్న 2 ఎకరాల్లో గుండుమల్లె మొక్కలను నాటారు. ప్రస్తుతం పంట దిగుబడులు వస్తున్నాయి. అన్ సీజన్ లో మల్లెపూల దిగుబడి వస్తుండటంతో ధరలు కూడా భాగానే ఉన్నాయంటున్నారు.
Read Also : Goruchikkudu Sagu : ఊరు ఊరంత గోరుచిక్కుడు సాగు – తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తున్న రైతులు