Basmati Cultivation : ఖరీఫ్ కు అనువైన బాస్మతి వరి రకాలు

బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం . భారతదేశం నలుమూలలా సువాసన గలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు అయితే ఉత్తర భారతదేశంలో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతొ ప్రసిద్ధి చెందటం వల్ల మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధ్యాన్యం తగ్గింది.

Basmati Cultivation : ఖరీఫ్ కు అనువైన బాస్మతి వరి రకాలు

Basmati Cultivation

Updated On : June 21, 2023 / 8:15 PM IST

Basmati Cultivation : ఘుమ ఘుమలాడే బిర్యానిలో బాసుమతి బియ్యానిదే కీలక పాత్ర. ఎగుమతి ప్రాధాన్యం కలిగి, అత్యదిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా మనదేశంలో బాసుమతి వరి, బహుళ ప్రాచుర్యం పొందింది. అనాదిగా బాసుమతి రకాల సాగుకు  తెలుగు రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా… మిల్లింగ్, మార్కెటింగ్ సమస్యల వల్ల ఆర్ధికంగా మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు.

READ ALSO : Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన వరంగల్ వరి రకాలు

ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాజేంద్రనగర్ వరి పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు, పొడవుగింజ సువాసన రకాలతోపాటు, మధ్యస్థ సైజు కలిగిన పొట్టిగింజ సువాసన రకాలను అభివృద్ధిచేసారు. ఖరీఫ్ లో వీటిసాగు ద్వారా రైతులు, అధిక దిగుబడితోపాటు, మంచి ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మంచి సువాసనతో పొగలుకక్కే బిర్యాని చూస్తే… ఎవరికైనా కడుపులో ఆకలి పరుగు పెట్టటం ఖాయం. దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధమైన వంటకంగా పేరుగాంచిన బిర్యానికి మన హైదరాబాద్ కేంద్రబిందువుగా నిలవటం గర్వకారణం. ఇంత విశిష్ఠమైన వంటకానికి మూలం బాసుమతి బియ్యం. రుచి, సువాసన, నాణ్యత, ధరల్లోను బాసుమతికి మరో రకం సాటిలేదు.

READ ALSO : Kunaram Rice Varieties : ఖరీఫ్ కు అనువైన కూనారం పరిశోధనా స్థానం వరి రకాలు.. ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి

బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం . భారతదేశం నలుమూలలా సువాసన గలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు అయితే ఉత్తర భారతదేశంలో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతొ ప్రసిద్ధి చెందటం వల్ల మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధ్యాన్యం తగ్గింది.

READ ALSO : Pady Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు

అయితే తెలుగు రాష్ట్రాల్లో పండే బాసుమతి రకాలు నాణ్యతలో మిగతావాటికి తీసిపోవు. అలాగే తెలంగాణలో స్థానికంగా సాగులో వున్న సువాసన రకాల కూడా మంచి నాణ్యతను కలిగి వున్నాయి. ఈ నేపధ్యంలో స్థానిక డిమాండ్ కు అనుగుణంగా పొడవు, మధ్యస్థ సైజు గింజకలిగిన సువాసన రకాల అభివృద్ధి చేశారు.. రాజేంద్రనగర్ వరి పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు. వీటిని ఖరీఫ్ లో సాగుచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. చంద్రమోహన్.