Japanese Mint Cultivation: జపనీస్ పుదీనా సాగు
సబ్బులు, సౌందర్య సాధనాలు, మెడిసిన్, సుగంధ పరిమళాల తయారీలో విరివిగా ఉపయోగించే సుగంధ తైల పంటలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు..

Mint Oil
Japanese Mint Cultivation: సబ్బులు, సౌందర్య సాధనాలు, మెడిసిన్, సుగంధ పరిమళాల తయారీలో విరివిగా ఉపయోగించే సుగంధ తైల పంటలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో రైతులు సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల నిమ్మగడ్డి, సిట్రొనెల్లా, పామారోజా, దవనం లాంటి వంటి పంటలను సాగుచేశారు రైతులు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు 10 ఎకరాల్లో జపనీస్ మింట్ సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
కోసి రకానికి చెందిన జపనీస్ మింట్. దీని ఆయిల్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని సుగంధాలు వెదజల్లే సబ్బులు, నూనెలు, అత్తర్లు, మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు . ముఖ్యంగా ఈ నూనె నాడీ సంబంధిత రుగ్మతలకు సహాయపడుతుంది. శ్వాసకోశ చికిత్స, కండరాల నొప్పులు, చర్మ సమస్యలకు చికిత్స కోసం, మనస్సుని ఉత్తేజపరిచేందుకు అధికంగా వాడుతుంటారు.
కరోనా కాలంలో ఆవిరి చికిత్సలో, పిప్పరమింట్ నూనెను వాడుతున్నారు. అలాగే దగ్గు, తలనొప్పి, వికారం, తగ్గిస్తుంది. ఇంతటి ఔషద గుణాలున్న ఈ జపనీస్ మింట్‌ను పశ్చిమగోదావరి జిల్లా, కొయ్యలగూడెం మండలం, దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరావు 10 ఎకరాల్లో రెండేళ్లుగా సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
జపనీస్ విత్తనం చల్లిన తరువాత మొదటి కోత 120 రోజులకు వస్తుంది. ఆ తరువాత నుండి పిలకలు విస్తరించి అభివృద్ధి చెందుతాయి కనుక రెండో పంట 90 రోజులకే వస్తుంది. వచ్చిన పంటను డిస్టిలేషన్ యంత్రంలో వేస్తారు. అందులో ఆకులు ఆవిరై మింట్ ఆయిల్ ద్రవంగా మారుతుంది. ఎకరా పంట నుండి 70 నుండి 80 కిలోల ఆయిల్ వస్తుంది. వచ్చిన ఆయిల్ ను పలు కంపెనీలకు సప్లై చేస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.