Katte Janumu : కట్టె జనుము సాగుతో భూసారం పెంచుకుంటున్న రైతు

శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కేవలం ఖరీఫ్ కే  నీరు అందుతోంది. ఇక రబీ పంటలైతే, కేవలం బోర్లపైనే  ఆధారపడి పండిస్తుంటారు.

Katte Janumu : ఖరీఫ్ వరి పంటలో వరుసగా వస్తున్న నష్టాలు.. రబీ అపరాల పంటలకు చీడపురుగుల బెడద.. వెరసి తీవ్రనష్టాలను మూటగట్టుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రైతులుకు  వర ప్రదాయినిలా మారింది కట్టేజనుము పంట. పైసా పెట్టుబడిలేకుండా.. ఏటువంటి ఏరువులు వాడకుండా, వేల రూపాయిల లాభాన్ని ఆర్జించి పెడుతుంది. దీంతో సిక్కోలు జిల్లాలో వందలాది మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. నష్టాలనుండి  బయటపడుతున్నారు.

Read Also : Green Gram Cultivation : పెసర, మినుము పంటల్లో చీడపీడల ఉధృతి

పసుపు పువ్వలతో ప్రకృతి పరవశించేలా ఉన్న ఈ  పంటని చూసారా .. ఇదే కట్టే జనుము పంట.  క్రోటలోరియా జ్యూనాసియా , సన్ హెంప్ గా పిలవబడే ఈ కట్టే జనుము పంట   రైతులకు సిరులు కురిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కేవలం ఖరీఫ్ కే  నీరు అందుతోంది. ఇక రబీ పంటలైతే, కేవలం బోర్లపైనే  ఆధారపడి పండిస్తుంటారు. నీటి సౌకర్యం లేని రైతులు.. మినుప, పెసర, నువ్వులు వంటి  ఆరుతడి  పంటలు పండిస్తూ ఉంటారు.

సున్నా పెట్టుబడితోనే వేల ఆదాయం :
కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో ఖరీప్ వరి అంత ఆశాజనకంగా ఉండటంలేదు. తుఫాన్లతో భారీగా వరి పంటకు నష్టం జరుగుతుంది. అరకొర దిగుబడులు వచ్చినా, మార్కెట్ లో ధర పలకడం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నష్టాలను పూడ్చుకుందామని రబీలో అపరాల పంటలైన, మినుము, పెసర లాంటి పంటలను వేస్తే, చీడపీడలు ఆశించి తీవ్రనష్టం చేస్తున్నాయి.

దీంతో ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లారు రైతులు. ఎలాంటి ఖర్చులేని కట్టెజనుమును ఎంచుకున్నారు పలాస మండలం, రాజగోపాల పురం గ్రామ రైతులు. ప్రస్తుతం కాత దశలో ఉన్న ఈ పంట మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో కూడా ధర బాగుండటంతో, ఎలాంటి పెట్టుబడి లేకుండానే లాభాలను పొందే ఆస్కారం ఉందంటున్నారు.

మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల , భూమిలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయి చౌడుశాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత  పెట్టుబడి పెట్టినా, దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా వున్న ప్రస్థుత పరిస్థితుల్లో, పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం.

Read Also : Sesame Cultivation : ఖరీఫ్‌‌కు అనువైన నువ్వు రకాలు.. అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం 

ట్రెండింగ్ వార్తలు