Green Gram Cultivation : పెసర, మినుము పంటల్లో చీడపీడల ఉధృతి

రైతులు సంప్రదాయ పంటల స్తానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.

Green Gram Cultivation : పెసర, మినుము పంటల్లో చీడపీడల ఉధృతి

Green Gram and Minumu Crop Cultivation Methods and techniques

Green Gram Cultivation : అపరాల పంటలైన పెసర, మినుము ప్రస్తుతం 30 నుండి 40 రోజుల దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల తెల్లదోమ, పల్లాకు తెగులు, పొగాకులద్దె పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రైతులు.. క్షేత్రాల్లో వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Green Leafy Vegetables : ఆకు కూరల సాగులో మేలైన యాజమాన్యం.. వేసవిలో మంచి డిమాండ్!

ఏ ఏటికాయేడు తెలుగురాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంత కాలంగా మార్కెట్ లో మంచి ధరలు పలుకుతుండటంతో రైతులు సంప్రదాయ పంటల స్తానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వేసవి పంటలుగా వేసిన  పెసర, మినుము 30 నుండి 40 రోజుల దశలో ఉంది.

మరో 40 రోజుల పాటు పంట ఉండాల్సి ఉంటుంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. ఇప్పటికే చాలా  తెల్లదోమ ఆశించి పల్లాకు తెగులు కారణమవుతుంది. కొన్ని చోట్ల పొగాకు లద్దెపురుగు ఆశించింది వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్

పలు ప్రాంతాల్లో  శనగపచ్చ పురుగులు , ఆకుమచ్చ తెగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో అరికట్టకపోతే నష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే సూక్ష్మపోషకాలు సమయానుకూలంగా అందించినట్లైతే.. మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

Read Also : Milky Mushroom Cultivation : కుటీరపరిశ్రమగా పుట్టగోడుగుల పెంపకం- ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం