Sesame Cultivation : ఖరీఫ్‌‌కు అనువైన నువ్వు రకాలు.. అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం 

Sesame Cultivation : ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు.

Sesame Cultivation : ఖరీఫ్‌‌కు అనువైన నువ్వు రకాలు.. అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం 

Techniques in Sesame Cultivation

Updated On : April 11, 2024 / 2:31 PM IST

Sesame Cultivation : తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్టప్రాంతాల్లో  పంటగా నువ్వును సాగుచేస్తుంటారు. ఎర్లీ ఖరీఫ్ మే రెండవ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుతారు.

Read Also : Nursery Cultivation : ప్రో ట్రేలలో నారు పెంపకంతో ఉపయోగాలు.. సమయం, డబ్బు ఆదా

అయితే, రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శీరిష.

తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే రెండవ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకొనే అవకాశం ఉంది.

అయితే ఖరీఫ్ లో అధిక దిగుబడిని సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోని విత్తుకోవాలి . నువ్వు విత్తడం ఒక ఎత్తైతే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం కూడా అంతే ముఖ్యం. ఖరీఫ్ నువ్వుసాగులో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎలాంటి యాజమాన్యం చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శీరిష

Read Also : Green Gram Cultivation : పెసర, మినుము పంటల్లో చీడపీడల ఉధృతి