Paddy Cultivation : ఖరీఫ్ వరి నారుమడులు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం మేలైన యాజమాన్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు.

paddy cultivation

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు  పోసే పనులు ముమ్మరంగా  కొనసాగుతున్నాయి  .  నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో వున్నా, చాలామంది రైతులు నారుమళ్ల ను పెంచి, నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు.

READ ALSO : Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరి కొంత మంది ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు నార్లు పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అందిరావాలంటే , నారుమడిలో మేలైన యాజమాన్యం పాటించాలంటూ.. తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.

READ ALSO : Kanda Yam Cultivation : కంద సాగుతో మంచి ఆదాయం.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు. అడపా, దడపా కురుస్తున్న వర్షాలకు మిగితా  రైతులు వరి నారుమళ్ళ తయారి చేపడుతున్నారు.

READ ALSO : Sri Sathyasai District : బాబోయ్.. ఒక్కసారిగా కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం, షాకింగ్ వీడియో

ప్రస్తుతం వరిలో మధ్యకాలి, స్వల్పకాలక, అతి స్వల్పకాలిక రకాలు నార్లు పోసుకునేందుకు వీలుంది. అయితే నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే..  మేలైన యాజమాన్యం తప్పనిసరి  అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, విజయ్.

READ ALSO : Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టిన నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్.. నెలకు రూ.50 లక్షల జీతమట.. అదేలా సాధ్యం.. అతడేం చేశాడో తెలుసా?

ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ వుండకుండా  చూసుకోవాలి . నీరు నిల్వ వుంటే విత్తనం మురిగిపోతుంది . మడుల మధ్య కాలువలు ఏర్పాటుచేసుకుంటే  నీరు నిల్వ వుండదు. ఏ కారణం చేతైనా పోషకాలను  సకాలంలో అందించని రైతాంగం, పిచికారీ రూపంలో అందిస్తే మంచిది.