Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టిన నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్.. నెలకు రూ.50 లక్షల జీతమట.. అదేలా సాధ్యం.. అతడేం చేశాడో తెలుసా?

Non Engineering Student : నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అయిన హర్షల్ జుయికర్, అనురాగ్ మకాడే అసాధారణమైన కోడింగ్ స్కిల్స్ సాయంతో Google, Amazonలో హైశాలరీలతో కూడిన ఉద్యోగాలను పొందారు. టెక్నాలజీ ఉద్యోగావకాశాలు ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదని నిరూపించారు.

Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టిన నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్.. నెలకు రూ.50 లక్షల జీతమట.. అదేలా సాధ్యం.. అతడేం చేశాడో తెలుసా?

Non-engineering Pune student lands a job at Google with whopping Rs 50 lakh salary

Non Engineering Student : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కంపెనీలో ఉద్యోగం సాధించడమంటే అంత ఈజీ కాదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు సైతం గూగుల్ జాబ్ సాధించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది ఎలాంటి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా గూగుల్ కంపెనీలో హై శాలరీ ఉద్యోగాన్ని సాధించాడో నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.. అతడో.. పూణేలోని హర్షల్ జుయికర్ అనే విద్యార్థి.. వాస్తవానికి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కానప్పటికీ.. గూగుల్‌లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగాన్ని పొందడం ద్వారా అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఇదేలా హర్షల్‌కు సాధ్యపడింది అంటే.. అతడిలో అసాధారణ నైపుణ్యాలు, దృఢ సంకల్పంతో అతనికి రూ. 50 లక్షల వార్షిక ప్యాకేజీని సంపాదించిపెట్టాయని నివేదిక తెలిపింది.

Read Also : Moto G14 Price in India : ఆగస్టు 1న మోటో G14 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

ముంబైలో పుట్టి పెరిగిన జుయికర్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ మాత్రమే పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ చదవలేదు. అయినప్పటికీ టెక్నాలజీ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్న జుయికర్ ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు. టెక్నిల్ స్కిల్స్ సాధించాలంటే ఇంజనీరింగ్ స్కిల్స్ అవసరం లేదని నమ్మి జయికర్.. కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో తన ప్రతిభను ఉపయోగించుకున్నాడు. కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా అతడు ఈ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. చివరికి గూగుల్ రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించాడు.

Non-engineering Pune student lands a job at Google with whopping Rs 50 lakh salary

Non-engineering Pune student lands a job at Google with whopping Rs 50 lakh salary

ప్రతిభ, వినూత్న ఆలోచనలు కలిగిన గ్రాడ్యుయేట్ జయికర్‌లో అసాధారణమైన కోడింగ్ సామర్ధ్యాన్ని, అద్భుతమైన ప్రతిభను గూగుల్ గుర్తించింది. దాంతో అతడికి హై ప్యాకేజీతో కూడిన ఉద్యోగాన్ని ఇచ్చింది. IIIT అలహాబాద్ నుంచి అనురాగ్ మకాడే అనే టెక్ విద్యార్థి కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అతడు ఉద్యోగం సంపాదించడం ద్వారా అద్భుతమైన ఫీట్ సాధించాడు. నాసిక్‌కు చెందిన మకాడేకు రూ.1.25 కోట్ల అత్యుత్తమ వేతన ప్యాకేజీని ఆఫర్ చేశారు. మకాడే ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న అమెజాన్‌లో ఫ్రంటెండ్ ఇంజనీర్‌గా పనిచేస్తాడు.

సోషల్ మీడియాలో తనన కొత్త రోల్ గురించి మకాడే ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. అమెజాన్‌లో ఫ్రంటెండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అమెజాన్‌లో చేరడానికి ముందు.. మకాడే బెంగళూరుకు చెందిన క్యూర్-ఫిట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, గురుగ్రామ్‌లోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో విశ్లేషకుడు ఇంటర్న్‌గా పనిచేశాడు.

మకాడే అధికారికంగా సెప్టెంబర్ 2022లో అమెజాన్‌లో తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. అంతేగాక, ఐఐఐటీ అలహాబాద్‌లో మకాడే ఒక్కటే కాదు. సంస్థ నుంచి ఇతర విద్యార్థులు కూడా అద్భుతమైన ప్లేస్‌మెంట్‌లను పొందారు. ప్రథమ్ ప్రకాష్ గుప్తా అనే వ్యక్తి రూ. 1.4 కోట్ల శాలరీ ప్యాకేజీతో గూగుల్‌లో ఉద్యోగం పొందాడు. పాలక్ మిట్టల్ అనే వ్యక్తి రూ. 1 కోటి ప్యాకేజీతో అమెజాన్‌లో ప్లేస్‌మెంట్ పొందగా.. రూబ్రిక్‌లో అఖిల్ సింగ్ రూ. 1.2 కోట్లతో వేతనంతో ఉద్యోగాన్ని పొందాడు.

Read Also : Twitter Earn Money : ట్విట్టర్‌ (X) క్రియేటర్ల కోసం కొత్త ప్రొగ్రామ్.. 500 ఫాలోవర్లు, 15 మిలియన్ల ఇంప్రెషన్స్ ఉంటే చాలు.. డబ్బులు సంపాదించవచ్చు..!