Moto G14 Price in India : ఆగస్టు 1న మోటో G14 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Moto G14 Price in India : మోటో G14 ఫోన్ అత్యంత సరసమైన ధరకే వచ్చేస్తోంది. ఆగస్టు 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

Moto G14 Price in India : ఆగస్టు 1న మోటో G14 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Moto G14 Price in India Tipped Ahead of August 1 Launch; Specifications Teased

Moto G14 Price in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా (Motorola) నుంచి మోటో G14 (Moto G14) ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో ఆగస్ట్ 1న లాంచ్ కానుంది. లాంచ్ చేయడానికి కొద్ది రోజుల ముందు టిప్‌స్టర్ హ్యాండ్‌సెట్ భారత ధర వివరాలను లీక్ చేసింది. అదనంగా, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లోని Moto G14 ఫోన్ ల్యాండింగ్ పేజీ హ్యాండ్‌సెట్ గురించి మరిన్ని వివరాలను షేర్ చేసింది.

6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. Unisoc T616 SoCలో రన్ అవుతుంది. మోటోరోలా 50MP మెయిన్ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. మార్చిలో భారత్‌లో మోటో G14 ఫోన్ Moto G13 ఫోన్‌కి సక్సెసర్‌గా వస్తుందని భావిస్తున్నారు.

Read Also : Amazon Great Freedom Sale : వచ్చేవారమే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు..!

టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ (@heyitsyogesh) మోటో G14 ఫోన్ ధర వివరాలను ట్విట్టర్ పోస్ట్‌లో లీక్ చేశారు. లీక్ ప్రకారం.. హ్యాండ్‌సెట్ ధర రూ. 10వేల లోపు ధరలో అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లో Moto G13 ఫోన్ ధర రూ. 9,999కు అందుబాటులో ఉండనుంది. ఈ వారం ప్రారంభంలో Moto G14 ఫోన్ ఆగస్టు 1న భారత్‌లో లాంచ్ అవుతుందని మోటోరోలా ధృవీకరించింది. ఇంతలో, ఫ్లిప్‌కార్ట్ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసే స్పెషల్ మైక్రోసైట్‌ను కూడా క్రియేట్ చేసింది.

Moto G14 Price in India Tipped Ahead of August 1 Launch; Specifications Teased

Moto G14 Price in India Tipped Ahead of August 1 Launch

మోటో G14 స్పెసిఫికేషన్స్ :
Moto G14 ఫోన్ Android 13లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14కి అప్‌గ్రేడ్ కానుంది.మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని కంపెనీ ధృవీకరించింది. 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో కేంద్రీయంగా హోల్-పంచ్ కటౌట్‌తో వస్తుంది. 4GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు Unisoc T616 SoCపై రన్ అవుతుంది. ప్రత్యేక స్లాట్ ద్వారా మైక్రో SD కార్డ్‌తో ఆన్‌బోర్డ్ స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. Moto G14 ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP52 రేటింగ్‌తో వస్తుంది. అథెంటికేషన్ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్ సపోర్టు ఇస్తుంది. 20W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉండనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 34 గంటల టాక్ టైమ్, 94 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయం, 16 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉండనుంది.

Read Also : Motorola Razr 40 Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. మడతబెట్టే మోటోరోలా Razr 40 సిరీస్‌పై రూ. 7వేలు ప్లాట్ డిస్కౌంట్.. మరెన్నో లాంచ్ ఆఫర్లు.. డోంట్ మిస్..!