Paddy Cultivation : వరిసాగులో యాంత్రికరణతో కూలీల కొరతకు చెక్.. డబ్బు కలిసొస్తుందంటున్న శాస్త్రవేత్తలు

Paddy Cultivation : సాగు విధానాన్ని మార్చుకుంటే చాలు ప్రతీ రైతు ఈ యంత్రాలను  ఉపయోగించుకునే  సౌలభ్యం వుంది. మెట్ట దుక్కిలో ట్రాక్టరుతో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్ లు కూడా ప్రస్థుతం అందుబాటులో వున్నాయి .

Paddy Cultivation : వరిసాగులో కూలీల కొరత తీవ్రంగా వున్నందు వల్ల రైతులు  సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్పిఆధునిక సాగు విధానాలపై  దృష్టి సారించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. దుక్కి దున్ని, విత్తనం వేసే దగ్గరి నుండి, పంట కోత నూర్పిడి వరకు కేవలం ఇద్దరు ముగ్గురు మనుషులతో పనులు పూర్తయ్యే విధంగా అధునాతన యంత్ర పరికరాలు  రైతులకు అందుబాటులో వున్నాయి. సాగు విధానాన్ని మార్చుకుంటే చాలు ప్రతీ రైతు ఈ యంత్రాలను  ఉపయోగించుకునే  సౌలభ్యం వుంది. వరిలో యాంత్రీకరణ అవశ్యకత, ఉపయోగాల గురించి  శ్రీకాకుళం జిల్లా, నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా. చిన్నమనాయుడు.

Read Also : Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిసాగుకు అనువైన రకాలు – అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

సంప్రదాయ వరిసాగులో  ప్రతీ పనికి మానవ వనరుల అవసరం చాలా ఎక్కువ. నారుపోయటం, నారుపీకటం, నాట్లు వేయటం, వరి కోతలు, నూర్పిళ్లు… ఇలా ప్రతీ పనీ కూలీలతో ముడిపడి వుంది. ప్రస్థుతం కూలీల లభ్యత తగ్గిపోయినందువల్ల  శాస్త్రవేత్తలు యాంత్రీకరణను  పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు.. వరిని నేరుగా పొడి దుక్కిలో వెదబెట్టటం, లేదా వెదజల్లే  విధానాలను  ప్రోత్సహిస్తున్నారు.

ఈ విధానంలో నారు నాట్లతో పనిలేదు . పశుసంపద  వున్న రైతులు గొర్రుతో విత్తనం వెదబెడుతున్నారు. దీన్నికూడా  సులభం చేస్తూ అనేక యంత్ర పరికరాలు అందుబాటులోకి  వచ్చాయని, వీటిని ఉపయోగించటం  ద్వారా రైతులు సాగులో సమస్యలను  సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా. చిన్నమనాయుడు.

మెట్ట దుక్కిలో ట్రాక్టరుతో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్ లు కూడా ప్రస్థుతం అందుబాటులో వున్నాయి . ఈ విధానంలో కూడా విత్తనాన్ని నేరుగా 8 వరుసల్లో విత్తుకోవచ్చు. వరి విత్తిన 10 రోజుల తర్వాత కలుపు రాకుండా 10 రోజుల వ్యవధితో  2 నుండి 3 సార్లు కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ తిప్పటం జరుగుతుంది.. దీనివల్ల కలుపు భూమిలో అణగదొక్కబడి, కుళ్లి, సేంద్రీయ ఎరువుగా మారుతుంది. అయితే ఇది కొంత శ్రమతో కూడిన పని. అయితే ఇప్పుడు యంత్రాలతో పనిచేసే రొటరీవీడర్ లు అందుబాటులోకి  వచ్చాయి. వీటిని సమయానుకూలంగా  తిప్పటం ద్వారా కలుపు సమస్యను సులభంగా అధిగమించవచ్చు .

వరిసాగులో శ్రీ విధానం రైతుకు ఒక వరం లాంటిది. అయితే కూలీల సమస్య వల్ల దీని ఆచరణ కష్టసాధ్యంగా వుంది. ఈ నేపధ్యంలో యంత్రశ్రీ విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి  తెచ్చారు. 6 నుండి 8 వరసల్లో నాట్లు వేసే ఈ యంత్రాల ద్వారా వరుసల  మధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్ల  ఎడంతో నాట్లు వేయవచ్చు .  వరి సాగులో అధికంగా కనిపించే మరో ఖర్చు కోత నూర్పిడి . ఎక్కువ వంది కూలీలు అవసరం వుండటంతోపాటు, ఈ పనులు చేపట్టే కాల వ్యవధి కూడా ఎక్కువ వుంటుంది. దీన్ని అధిగమించేందుకు  అనేక కోత నూర్పిడి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

Read Also : Weed Control In Cotton : తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగు కానున్న పత్తి.. కలుపు నివారణ..

ట్రెండింగ్ వార్తలు