Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిసాగుకు అనువైన రకాలు – అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

Onion Cultivation : కొద్ది పాటి మెళకువలు పాటించినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ సాగులో పాటించాల్సిన యాజమాన్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిసాగుకు అనువైన రకాలు – అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

Cultivation Techniques Of Mirchi

కూరగాయ పంటల్లో ఉల్లి ప్రధానమైనది. ఏ కూర వండాలన్నా ఉల్లి వేయాల్సిందే. దీంతో ఉల్లి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ప్రధానంగా కర్నూలు దీని సాగుకు పెట్టింది పేరు. అయినా తెలంగాణ ప్రాంతాల్లో కూడా అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ప్రస్తుతం ఉల్లి విత్తుకునే సమయం.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

సాధారణంగా ఖరీఫ్‌లో సాగయ్యే ఉల్లికి మార్కెట్‌లో అధిక డిమాండ్‌తో పాటు చీడపీడల వ్యాప్తి కూడా ఎక్కవగానే ఉంటుంది. కాబట్టి ఉల్లిని సాగుచేసే రైతులు మేలైన రకాలతోపాటు, కొద్ది పాటి మెళకువలు పాటించినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ సాగులో పాటించాల్సిన యాజమాన్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాణిజ్యపరంగా సాగుచేసే గడ్డ జాతి కూరగాయల పంటల్లో ఉల్లి ఒకటి. మన దేశంలో పండించే ఉల్లిలో.. అధిక భాగం మహారాష్ట్రలోని నాసిక్ నుండి దిగుమతి అవుతుంది. తెలంగాణలో ఉల్లి పంటను దాదాపు 45 వేల 577 హెక్టారుల్లో సాగుచేస్తూ.. 4 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తిని సాధిస్తున్నాం.. అవుతుంది. ముఖ్యంగా  గద్వాల్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నిజామాబాద్‌, వనపర్తితో పాటు నారాయణఖేడ్‌ జిల్లాల్లో అధికంగా సాగవుతుంది. ఉల్లి సాగుకు సారవంతమైన అన్నిరకాల నేలలు అనుకూలమైనప్పకీ, బంక, క్షార భూములు చౌడు నేలలు పనికిరావు.

ఖరీఫ్ , రబీ, వేసవి కాలలలో సాగుచేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వర్షాకాలం పంటను ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్‌లో సాగయ్యే ఉల్లికి చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. గడ్డ నిల్వగుణం తక్కువ. కాబట్టి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు సమయానుకూలంగా సమగ్ర యాజమన్య పద్ధతులను చేపడితే అధికి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలంయ కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్త లావణ్య.

ఖరీఫ్‌లో వర్షాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పంటకు చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉల్లి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతే కాదు మనం చేపట్టే పోషక యాజమాన్యంపైనే దిగుబడులు ఆదారపడి ఉంటాయి. కాబట్టి రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు మేలైన యాజమాన్యం చేప్టాలి.

Read Also : Mirchi Cultivation : ఈ సూచనలు పాటిస్తే పచ్చిమిర్చి సాగులో అధిక లాభాలు