Black Gram Cultivation : రబీకి అనువైన మినుము రకాలు.. మూడు కాలాల్లో సాగుకు అనుకూలం

మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.

Rabi Varieties

Black Gram Cultivation : తక్కువ సమయం, తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట  మినుము. మూడు కాలాల్లో సాగుచేసుకోవచ్చు. అంతర పంటగా కూడా వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రబీ లో మినుమును అక్టోబర్ వరకు వేసుకోవచ్చు.  అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపికచేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది. రబీకి అనువైన మినుము రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీలత.

READ ALSO : Cultivation of Palm Oil : ప్రకృతి విధానంలో పామాయిల్ సాగు.. తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి

తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 12.5 లక్షల ఎకరాల్లోను, తెలంగాణలో 3 లక్షల 75 వేల ఎకరాల్లో సాగవుతుంది. ప్రస్తుత రబీ లో నీటివసతి కింద, అక్టోబర్  వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ వరి కోసిన మాగాణి పొలాల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. అసలు రబీ మినుము రకాలు ఏంటి..? వాటి గుణగణాలు, దిగుబడి ఏవిధంగా వుంటుందో తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీలత.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

విడుదలకు ముందే మినికిట్ దశలో మరికొన్న రకాలు రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా లాంఫాం, తిరుపతి, ఘంటసాల పరిశోధనా కేంద్రాలు రూపొందించిన పలు రకాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఇవి కూడా రబీకి అనువైన రకాలే. ఆసక్తి ఉన్న రైతులు ఆయా పరిశోధన స్థానాల్లో సంప్రదించవచ్చు .