More Income In Taiwan Lemon
Taiwan Lemon : తైవాన్ జామ.. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లో పండ్ల సాగుచేసే ప్రతి రైతు ఈ మొక్కలను నాటుతున్నారు. మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. రైతులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సాగుకు శ్రీకారం చుట్టగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. అలాగే నూతన రకాలు వస్తున్నాయి. సాధారణంగా పండ్ల తోటల్లో అయితే మొక్కనాటిన 4, 5 సంవత్సరాలకు దిగుబడులు ప్రారంభమవుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో నాటిన ఏడాది లోపే దిగుబడులు వచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోవలోనే నిమ్మలో కొత్తరకం రైతుల క్షేత్రాల్లో సిరులు కురిపిస్తోంది.
రైతులకు అందుబాటులో నూతన నిమ్మరకం వచ్చింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ నిమ్మతోటను చూడండీ.. ఇదే ఆ నూతన రకం తైవాన్ నిమ్మ. సాధారణ రకాలైతే నాటిన మూడునాలుగేండ్లకు కాపుకు వస్తుంది. అధికూడా ఏడాదికి రెండు పంట దిగుబడులే వస్తాయి. కానీ ఈ నిమ్మరకం నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమవుతుంది.
అంతే కాదు ఏడాది పొడవునా కాత కాస్తూనే ఉంటుంది. ఇలా 15 నుండి 20 ఏళ్ల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. మార్కెట్ లో ధరలు హెచ్చుతగ్గు ఉన్నా.. లాభాలు మాత్రం ఫుష్కలం. అందుకే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, మైసన్న గూడేనికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం రెండేళ్ల క్రితం ఎకరంలో తైవాన్ నిమ్మను సాగుచేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండటం.. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. చెట్టుకు ఓ వైపు కాయలు ఉంటే మరో వైపు పూత ఉంటుంది. సాధారణ రకాలైతే ఎకరాకు 100 మొక్కలు నాటే అవకాశం ఉంది. కానీ తైవన్ రకం అయితే ఎకరాకు మొక్కల మధ్య దూరం ఎటు చూసిన 12 అగుడులు ఉంటే 303 మొక్కల.. బలం తక్కువ నేలల్లో మొక్కల మధ్య దూరం ఎటు చూసిన 10 అగుడులు పెడితే 434 మొక్కలు పడుతాయి. అంతే కాదు వీటికి ముళ్లు శాతం చాలా తక్కువ. దీంతో కోత కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
సాధారణ రకాలతో పోల్చితే తైవాన్ నిమ్మ అన్ని రకాలు గా లాభదాయంగా ఉండటంతో వీటిసాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తోటలను ప్రత్యక్షంగా చూసి, యాజమాన్య పద్ధతులు, పెట్టుబడి వివరాలు తెలుసుకునేందుకు వస్తున్నారు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..