Mulberry Farming : మల్బరీ తోట సాగుతో మస్త్ ఆదాయం

ఈ మల్బరి ఆకునే పురుగులు తిని పట్టుదారాన్ని ఇస్తుంటుంది. అయితే గతంలో లాభసాటిగా ఉన్న పట్టుపురుగుల పెంపకం మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొంత లాభాలు తగ్గాయి.

Mulberry Farming

Mulberry Farming : సంప్రదాయ వాణిజ్య పంటలకు భిన్నంగా లాభాలు ఆర్జించే వాటిల్లో మల్బరీ ఒకటి. మల్బరీ తోటను సాగు చేసి, పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే పట్టు గుడ్లకు సరైన ధర రాకపోవడంతో ఏలూరు జిల్లాకు చెందిన కొందరు రైతులు కేవలం మల్బరి తోటలనే సాగుచేస్తున్నారు. వచ్చిన ఆకు దిగుబడిని ప్రైవేట్ కంపెనీకి అమ్ముతూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

వ్యవసాయ అనుబంధ పంట పట్టుపురుగుల పెంపకం. పట్టు పురుగులను పెంచాలంటే తప్పకుండా మల్బరి తోటలను వేసుకోవాలి. ఈ మల్బరి ఆకునే పురుగులు తిని పట్టుదారాన్ని ఇస్తుంటుంది. అయితే గతంలో లాభసాటిగా ఉన్న పట్టుపురుగుల పెంపకం మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొంత లాభాలు తగ్గాయి. దీంతో ఇప్పటికే మల్బరి ఆకుతోటలను సాగుచేస్తున్న రైతులు పురుగుల పెంపకాన్ని వదిలేసి కేవలం మల్బరి తోటలనే పెంచుతున్నారు.

వచ్చిన ఆకుదిగుబడిని ప్రైవేట్ కంపెనీటకు టన్నుల కొద్దిగా అమ్మతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు. ఒక్కసారి నాటిన మొక్కల నుండి తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఏళ్ల తరబడి దిగుబడి పొందుతున్నామని ఏలూరు జిల్లా, దెందులూరు మండలం, రామారావు గూడెం గ్రామరైతులు చెబుతున్నారు.

Read Also : Nursery Cultivation : ప్రో ట్రేలలో నారు పెంపకంతో ఉపయోగాలు.. సమయం, డబ్బు ఆదా