Mulberry Fruit Farming : సరస్వతి గూడ.. ఇక్కడ మొత్తం మల్బరీ పండ్ల తోటలే

Mulberry Fruit Farming : వ్యవసాయంలో రోజు రోజుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. దిగుబడులు. వీటికి తోడు మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా... చీడపీడల ఉదృతి పెరిగి కూడా తగ్గుతున్నాయి.

Mulberry Fruit Farming

Mulberry Fruit Farming : మల్బరీ పండ్లు… ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా చోట్ల కనబడుతున్నాయి. ఇందులో ఔషద గుణాలు ఉండటంతో ఈ పండ్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. వీటి ధర కూడా అలాగే ఉంది. మార్కెట్లో ఈ పండ్లకి ఉన్న డిమాండ్ ను చూసిన రంగారెడ్డి జిల్లా, సరస్వతిగూడ గ్రామానికి చెందిన రైతులు అందరూ మల్బరీ పండ్లతోటలను సాగు చేస్తున్నారు. అతితక్కువ పెట్టుబడితో.. ప్రతిరోజు ఆదాయం పొందుతున్నారు.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు

వ్యవసాయంలో రోజు రోజుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. దిగుబడులు. వీటికి తోడు మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా… చీడపీడల ఉదృతి పెరిగి కూడా తగ్గుతున్నాయి. వచ్చిన దిగుడులకు మార్కెట్ లో సరైన ధర రావడం లేదు. దీంతో సంప్రదాయ పంటల సాగు కత్తిమీద సాములా మారింది. అందుకే చాలా మంది ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. అధికంగా పని తక్కువ ఉండి దీర్ఘకాలంగా దిగుబడులు వచ్చే పండ్లతోటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. కొందరు రైతులైతే అందరు వేసే పంటలు కాకుండా కొత్త పంటల సాగు వైపు చూస్తున్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న వాటిని ఎంచుకొని సాగుచేస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, సరస్వతిగూడ గ్రామానికి చెందిన రైతులు.

హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న సరస్వతి గూడలో దాదాపు 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇందులో 70 శాతం మంది రైతులే.. అందరూ.. సన్న, చిన్నకారు రైతులు. తమకున్న ఎకరం, రెండెకరాల వ్యవసాయ భూమిలో గతంలో బొప్పాయి, జామ లాంటి పండ్లతోటల పెంపకం చేపట్టారు. అయితే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఉన్న కొద్దిపాటి నీటితో పంటలు సరిగ్గా పండకపోయేది.. అయితే మారుతున్న కాలాను గుణంగా  కొత్త పంటలు పరిచయం కావడం.. అందులో మల్బరీ పండ్లకు మార్కెట్ లో  అధిక డిమాండ్ ఉండటంతో… ఒకరిద్దరు ప్రయోగాత్మకంగా కొద్ది విస్తీర్ణంలో మల్బరీ పండ్లతోటలను నాటారు. పెట్టుబడి, శ్రమ , తక్కువగా ఉండటంతో పాటు సాగునీటి అవసరం కూడా ఉండటంతో ఒకరి తరువాత ఒకరు ఇలా ఊరంతా మల్బరీ పండ్ల తోటలను చేపట్టారు.

మల్బరీ పండ్లతోటలు సాగు చేయడానికి విత్తనాలు ఉండవు. మల్బరీ మొక్కల చెట్టు కొమ్మని తీసి మొక్కలుగా నాటుకోవాలి. నాటిన రెండు సంవత్సరాల నుండి పండ్ల దిగుబడి వస్తుంది. గతంలో కిలో పండ్ల ధర రూ. 500-700 వరకు ఉండేది. ఇప్పుడు కిలో 150-200 వరకు అమ్ముతున్నారు. ఇలా ప్రతి రైతు ఎకరంలో రోజుకు 25 కిలోల దిగుబడిని తీస్తూ.. రెండు నుండి రెండువేల ఐదువందల వరకు ఆదాయం పొందుతున్నారు.

మల్బరీ పండ్లు ఏడాది మొత్తం కాస్తాయి. అయిలే ప్రతి చెట్టుని 30 నుండి 35 రోజులకు ఒక సారి ట్యూనింగ్ చేసుకోవాలి. ట్యూనింగ్ అంటే చెట్టు ఆకులు మొత్తం తీసివేయాలి. ట్యూనింగ్ చేసిన నెల రోజులకి పూత వస్తుంది. ఈ పండ్లని పిట్టలు, పక్షులు ఎక్కువగా తింటాయి. వీటి నుంచి ఈ పండ్లని కాపాడుకోవడానికి చేపల వలను కొందరు రైతుల పొలం చుట్టూ, చెట్ల పై భాగంలో కూడా కట్టుకుంటున్నారు.

ఉన్న కొద్దిపాటి భూమిలో ఒక మల్బరీ తోటలనే కాకుండా కూరగాయలు, ఆకుకూరలను సాగుచేస్తున్నారు రైతులు.. కూరగాయలపై వచ్చే ఆదాయం పై ఖర్చులకు అవసరం వస్తుండగా.. మల్బరీపండ్లపై వచ్చే ఆదాయం లాభాలు అంటున్నారు రైతులు. అయితే ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో.. తమకు డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందిస్తే.. పంటలసాగులో మరింత ముందుకు వెళ్ళేందుకు వీలుంటుందని కోరుతున్నారు.

Read Also : Marigold Farming : మార్కెట్‌లో బంతికి మంచి డిమాండ్ – అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం