Marigold Farming : మార్కెట్‌లో బంతికి మంచి డిమాండ్ – అధిక దిగుబడికి మేలైన యాజమాన్యం 

Marigold Farming : వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది.

Marigold Farming : మార్కెట్‌లో బంతికి మంచి డిమాండ్ – అధిక దిగుబడికి మేలైన యాజమాన్యం 

Marigold Farming

Updated On : January 19, 2025 / 4:39 PM IST

Marigold Farming : మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పూలలో ప్రధానమైనది బంతి.  పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ పూలకు మంచి డిమాండు ఉంటుంది. అంతే కాదు ఎక్కువ కాలం, నిల్వ స్వభావం ఉండటంతో, రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతుంటారు. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడంతో,  అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు రైతులు.

Read Also : Home Agriculture : నగరాల్లో విస్తరిస్తున్న మిద్దెతోటలు – తక్కువ ఖర్చుతో ఇంటిపైనే కూరగాయల సాగు చేస్తున్న కుటుంబం

బంతిపూల సాగు (Marigold Farming)లో నాణ్యమైన అధిక దిగుబడులను ఏవిధంగా సాధించాలో తెలియజేస్తున్నారు పార్వతిపురం మన్యం జిల్లా ఉద్యానశాఖ అధికారి క్రాంతి కుమార్. పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో, మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో, సాగు విస్తీర్ణం కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే.. సాగులో రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూలదిగుబడి ప్రారంభమై.. మూడు నెలలపాటు దిగుబడి వస్తుంది.

ప్రస్థుతం చాలామంది రైతులు ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే  ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు . బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పార్వతిపురం మన్యం జిల్లా ఉద్యానశాఖ అధికారి క్రాంతి కుమార్.

Read Also : Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం