Paddy Cultivation : వరిలో అగ్గి తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు  

Pests in Rice : ప్రస్తుతం పిలక దశలో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గితెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Prevention of Pests in Rice

Prevention of Pests in Rice : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి పిలక దశలో ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా , వరికి వివిధ రకాల తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా  అగ్గి తెగులు, మెడవిరుపు, కాండంకుళ్లు తెగుళ్లు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తున్నాయి.

Read Also : Paddy Cultivation : రబీ వరినాట్లలో మేలైన జాగ్రత్తలు.. వరిసాగు యాజమాన్యం

ఈ తెగుళ్లను.. రైతులు సకాలంలో గుర్తించి, నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తేలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత వి. భువనేశ్వరి.

రబీ వరినాట్లు పడ్డాయి. చాలా చోట్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా రైతులు నాట్లు వేశారు. ప్రస్తుతం పిలక దశలో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గితెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ డెల్లా ప్రాంతాల్లో పండించే సన్నరకాల్లో మెడవిరుపు, కాండంకుళ్లు , దుబ్బుకుళ్లు సోకినట్లు గుర్తించారు. అంతే కాదు అధిక ఎరువులు వాడటం వల్లకూడా అగ్గితెగులు ఆశించింది.

ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉదృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకిదశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.. ఈ తెగులును ఎవిధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు,పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం  సీనియర్‌ శాస్త్రవేత వి. భువనేశ్వరి.

Read Also : Green Gram Cultivation : వేసవి పెసరసాగులో మెళకువలు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు