Green Gram Cultivation : వేసవి పెసరసాగులో మెళకువలు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

Green Gram Cultivation : వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

Green Gram Cultivation : వేసవి పెసరసాగులో మెళకువలు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

Green Gram Cultivation

Updated On : February 29, 2024 / 4:29 PM IST

Green Gram Cultivation : తక్కువ పెట్టుబడితో, స్వల్పకాలంలో చేతికొచ్చేవి అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు.. ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా వుంటాయి. ప్రత్తి పంట పూర్తయిన పొలాలు, రబీ వేరుశనగ పూర్తయిన ప్రాంతాల్లోను.. వేసవిపంటగా పెసరసాగు రైతుకు అనుకూలంగా వుంటుంది.

Read Also : Sesame Cultivation : వేసవికి అనువైన నువ్వు రకాలు – యాజమాన్యం

ఇప్పటికే  పెసరను విత్తిన ప్రాంతాల్లో  పైరు వారం రోజుల నుండి 20 రోజుల దశ వరకు వుంది. అయితే వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ .

స్వల్ప వ్యవధిలో పంట చేతికొచ్చి, రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయి అపరాల పంటలు. ముఖ్యంగా పెసర అన్ని కాలాల్లోను సాగుకు అనుకూలంగా వుంటుంది. ఏకపంటగానే కాక, పలుపంటల్లో అంతర పంటగాను, పచ్చిరొట్ట పైరు గాను, పలుపంటల సరళిలో పంటమార్పిడి కోసం ఇట్టే ఇమిడిపోవటంతో దీనిసాగు నీటిపారుదలకింద, వేసవిలో సైతం రైతుకు లాభదాయంకంగా మారింది.

సాధారణంగా ఫిబ్రవరి నుంచి మార్చి 15వరకు పెసర విత్తటానికి అనుకూలమైన సమయం. నీటివసతి కింద ఇప్పటికే  పెసరను విత్తిన రైతాంగం.. కీలకమైన సాగు యాజమాన్య పద్ధతుల పట్ల కూడా కొంత అవగాహన కలిగి వుండాలని సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

Read Also : Paddy Cultivation : రబీ వరినాట్లలో మేలైన జాగ్రత్తలు.. వరిసాగు యాజమాన్యం