Sesame Cultivation : వేసవికి అనువైన నువ్వు రకాలు – యాజమాన్యం

Sesame Cultivation : వేసవి కాలంలో రెండు మూడు నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

Sesame Cultivation : వేసవికి అనువైన నువ్వు రకాలు – యాజమాన్యం

Sesame Cultivation Process

Updated On : February 28, 2024 / 4:32 PM IST

Sesame Cultivation : నీటి వసతి వున్న రైతాంగం  వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. మరి వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు ఏంటో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి.

Read Also : Sugarcane Cultivation : చెరకు కార్శితోటల యాజమాన్యం.. సాగుతో సమయం, పెట్టుబడి ఆదా

పత్తి, మిరప, పసుపు పంటలు తీసిన తరువాత రైతులు.. వేసవిలో అధికంగా పండించే పంట నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ప్రతి ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వేసవి కాలంలో రెండు మూడు నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా , రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది.

వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది.  నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో  తెల్ల నువ్వు రకాలు క్వింటా 8 వేల నుంచి 12 వేల వరకు ధర పలుకుతున్నాయి.

ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం . అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి.

Read Also : Mango Cultivation : మామిడిలో పూత, కాయ నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలు