Paddy Cultivation : రబీ వరిసాగు యాజమాన్యం.. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు

Paddy Cultivation : తెగులు రాష్ట్రాల్లో రబీ వరినాట్లు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే నాట్లు వేయగా.. మరికొన్ని చోట్ల ఇప్పుడ వేసేందుకు సిద్దమవుతున్నారు.

Paddy Cultivation

Paddy Cultivation : తెగులు రాష్ట్రాల్లో రబీ వరినాట్లు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే నాట్లు వేయగా.. మరికొన్ని చోట్ల ఇప్పుడ వేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే వరిసాగులో మేలైన దిగుబడులు సాధించాలంటే నాట్లలో మెళకువలతో పాటు సమగ్ర ఎరువులు, చీడపీడల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, ఉయ్యూరు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ నందకిషోర్.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

నీటి వసతి వున్న ప్రాంతాల్లో రబీ వరిసాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరినాట్లు పూర్తి కావచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. కొంత మంది డ్రమ్ సీడర్ తో విత్తుతున్నారు. మరికొంత మంది నేరుగా వెదజల్లుతున్నారు. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది.  అయితే వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు, వేసిన రైతులు.. వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల శ్రద్ధవహించాలి.

తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న రబీ వరినాట్లు :
సాధారణంగా  రబీకాలంలో స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు కనుక, వరిపైరులో పిలలుచేసే సమయం తక్కువ వుంటుంది. అందువల్ల పంట దశనుబట్టి  సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఉయ్యూరు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ నందకిషోర్.

తొలిదశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా  అగ్గితెగులు, కాండంకుళ్లు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. కనుక తొలిదశలోనే వాటికి నివారణ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.  అంతే కాదు ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు వరిసాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.

Read Also : Sugarcane Cultivation : చెరకు సాగులో మేలైన యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు