Paddy Cultivation with Gir Cows
Paddy Cultivation : మారిన మానవ జీవన శైలిలో భాగంగా ప్రకృతి విధానంలో సాగుచేసిన పంటలు అవసరమవుతున్నాయి. అందుకే ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు చాలా మంది రైతులు. మొదట దిగుబడులు తగ్గినా.. తరువాత తరువాత అధిక దిగుబడులను రాబట్టడంలో రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఏళ్ళుగా ప్రకృతి వ్యవసాయంలో వరిని పండిస్తూ.. సత్ఫలితాలను సాధిస్తున్నారు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..
పంటల సాగులో రసాయనిక ఎరువుల సాగు పెరిగిపోవడంతో.. పంటలు విషతుల్యం అవుతున్నాయి. వాటివల్ల జనం వింత రోగాల బారిన పడుతున్నారు. తక్కువ వయస్సులోనే బీపీ, షుగర్, గుండె జబ్బు లు బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే చాలా మంది ప్రకృతి విధానంలో పండించిన పంటలను తినాలనే అవగాహన పెరిగింది. అందుకే చాలా మంది రైతులు ఈ విధానంలో పంటలను సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, అచంట గ్రామానికి చెందిన రైతు చిలుకూరి విశ్వేశ్వరరావు ఐదేళ్ళుగా ప్రకృతి విధానంలోనే వరిసాగుచేస్తున్నారు.
రైతు విశ్వేశ్వరరావు గతంలో రసాయఎరువులు, పురుగుమందులతోనే పంటలసాగు చేపట్టేవారు. అయితే రాను రాను పెట్టుబడులు పెరిగాయి కానీ దిగుబడులు మాత్రం పెరగలేదు. వచ్చిన దిగుబడులకు మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర అందడంలేదు. దీంతో సుభాష్ పాలేకర్ స్పూర్తితో 5 ఏళ్ళ క్రితం గిర్ ఆవులు, ఒంగోలు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు.
మొదట దిగుబడులు తగ్గినా.. రానురాను రసాయన సాగులో వచ్చిన దిగుబడికి ధీటుగా వస్తుండటంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో.. అధిక దిగుబడి రావడం.. వచ్చిన ధాన్యాన్ని మరపట్టించి.. నేరుగా వినియోగదారులకు అమ్ముతూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.
Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్లో వరిగట్లపై కూరగాయల సాగు