Pest control in maize crop
Pest control in maize crop : మొక్కజొన్న.. రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి , పత్తి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహారధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంట కాలంలో, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంటను సాగుచేశారు. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెరపురుగు, పొగాకు లద్దెపురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధారాణి.
Read Also : Wheat Cultivation : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి, తెగుళ్ల నివారణ
మొక్కజొన్న సాగులో పెరిగిన చీడపీడల ఉధృతి :
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంట మొక్కజొన్న. ఇటీవల కాలంలో రైతు అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు . వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు . మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ళ దాణాలో ప్రధాన ముడి సరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగుచేస్తారు. రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద సాగుచేశారు రైతులు.
ఇప్పటికే నెలరోజుల దశలో పైరు ఉంది. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెరపురుగు, పొగాకు లద్దెపురుగులతో పాటు కాండంకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధారాణి.
మొక్కజొన్న పంటలో అక్కడక్కడ ఐరన్, జింక్, సూక్ష్మధాతు లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లరేగడి భూములు, సున్నం ఎక్కువగా ఉన్న భూములు, నీరు నిలిచే భూములు , ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదును చేసిన నేలల్లో, భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో ఈలోపాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ దశలో ఉన్న ఈ పంటలో వీటిని గుర్తించినట్లైతే రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చు.
Read Also : Sesame Cultivation : నువ్వుల సాగుపై జగిత్యాల పరిశోధనా స్థానాల అధ్వర్యంలో కిసాన్ మేళా