Seed Treatment
Seed Treatment : పంటల్లో అధిక దిగుబడిని సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంపిక కీలకం. అయితే పంటలసాగులో రైతులు చాలా వరకు చీడపీడల నివారణకు అధిక ఖర్చు చేస్తుంటారు. కానీ.. నివారణ కంటే నిరోదనే మేలని మనకు తెలుసు . అందుకే చీడపీడలు ఆశించాక, పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవడంకంటే.. పంట విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా.. పంట తొలిదశలో వచ్చే చీడపీడలను తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వివిధ రకాల పంటలలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.
READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు
నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో.. శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల విత్తనం , నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తనశుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది . మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు.
READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు
విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి , తొలిదశలో పురుగులు, తెగుళ్ళను ఆరికట్టి , తర్వాత దశలో పిచికారి మందులు , కూలీల పై పెట్టె ఖర్చును తగ్గించుకోడానికి తోడ్పడుతుంది. పురుగు, తెగుళు సోకిన తరువాత పిచికారి చేసే మందులకు అయ్యే ఖర్చులో 10% మాత్రమే విత్తనశుద్ధి కి అవుతుంది.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసి తర్వాత నీడలో ఆరబెట్టి శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేసి చివరిగా జీవ రసాయన మందులు లేదా జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.