Chilli Farming : మిరప నాట్లకు సిద్ధమవుతున్న రైతులు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Chilli Farming : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని, నారుమళ్లు పోసుకున్నారు.

Chilli Farming : మిరప నాట్లకు సిద్ధమవుతున్న రైతులు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Precautions for Chilli Farming

Chilli Farming : తెలుగు రాష్ర్టాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్యపంట  మిరప. దాదాపు 5 లక్షల హెక్టార్లలో సాగవుతూ… ఉత్పాదకతలో దేశంలోనే ప్రథమస్థానంలో వుంది.  సాధారణంగా జూన్, జూలై నెలల్లో నారుపోసి, ఆగష్టు నుంచి సెప్టెంబరు మొదటి పక్షం వరకు నాట్లు వేయటం పరిపాటి. ఇప్పటికే నార్లు పోసిన రైతాంగం నాట్లుకు సిద్దమవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు  ప్రధాన శాస్త్రవేత్త డా. శారద.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని, నారుమళ్లు పోసుకున్నారు. జూన్., జులై నెలల్లో నారు పోసుకున్నవారు నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు  నాట్లు వేశారు.

అయితే, అధిక దిగుబడులు సాధించాలనే ఆతృతతో రైతులు విచక్షణా రహితంగా ఎరువులను వేస్తుంటారు. అలాగే పురుగుమందులను విపరీతంగా పిచికారి చేస్తుంటారు. దీంతో పురుగుమందు అవశేషాలు మిరపలో ఉండి, ఎగుమతికి అవరోదంగా మారుతుంటుంది. కాబట్టి నాటు పెట్టే దగ్గర నుండి సమగ్య యాజమాన్య పద్ధతులు పాటిస్తే  ఆరోగ్యవంతమైన దిగుబడులను పొందవచ్చంటున్నారు లాం ఫాం ఉద్యాన పరిశోధన స్థానం  ప్రధాన శాస్త్రవేత్త డా. శారద.

మిరప నాణ్యతను, దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో పోషక యాజమాన్యం అత్యంత కీలకమైనది. ప్రాంతాలకు తగ్గట్లుగా, నేలలను అనుసరించి ఎరువులను అందించాల్సి వుంటుంది. సిఫారసు మేరకు మాత్రమే పోషకాలను అందించనట్లయితే చీడపీడల ఉధృతిని కొంత వరకు అదుపులో వుంచే అవకాశం వుంటుంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు