Cattle In Winter : శీతాకాలంలో పాడిపశువుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి!

పశువులను ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి , వెలుతురు వచ్చే విధంగా మురికినీరు బయటకు వెళ్ళే విధంగా ఏర్పట్లు చేసుకోవాలి.

Cattle In Winter : శీతాకాలంలో పాడిపశువుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి!

Precautions for the health of dairy cattle in winter are a must!

Updated On : November 21, 2022 / 4:03 PM IST

Cattle In Winter : శీతాకాలంలో పాడిపశువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం, అధిక చలిగాలు వల్ల పశువుల తీవ్ర అసౌకర్యానికి లోనవుతాయి. దీంతో పాటు జీర్ణ వ్యవస్ధ మందగిస్తుంది. ఆహారం సక్రమంగా తీసుకోకపోవటం వల్ల పశువులో పోషకాలు తగ్గిపోతాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో పాల ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి శీతాకాలంలో పశుపోషణలో తగిన జాగ్రత్తలు పాటించాలని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శీతాకాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు ;

1. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల నియోకాకై సూక్ష్మజీవులు పశువుల ఊపిరితిత్తులపై దాడిచేసి శ్వాసకోశ వ్యాధులకు గురిచేస్తాయి. దీంతో ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడి శ్వాసప్రక్రియలో సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో వ్యాధినిరోధ మందులను పశువులకు దాణాలో కలిపి అందించాలి.

2. పశువులకు అందించే ఆహారంలో మార్పులు చేయాలి. సాధారణంగా ఇచ్చే ఆహారానికి భిన్నంగా శీతాకాలంలో సమీకృత ఆహారంలో ఫాస్పెట్ అధికంగా ఉండే గోధుమ తవుడుతో తయారైన దాణాను అందించాలి.

3. పశువులను ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి , వెలుతురు వచ్చే విధంగా మురికినీరు బయటకు వెళ్ళే విధంగా ఏర్పట్లు చేసుకోవాలి. చలిని తట్టుకునేలా పాకల్లో వేడి ఉష్ణోగ్రతలు కల్పించేలా చుట్టూ పట్టాలను కట్టుకోవాలి. అవసరమనుకుంటే నేలపై ఎండుగడ్డిని పరుచుకోవాలి.

4. పశువుల్లో శీతాకాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు, తదితర అంటువ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ముందుగానే నివారణ చర్యగా వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. పశువుల జీర్ణ ప్రక్రియ మందగించకుండా చర్యలు తీసుకోవాలి.

5. పశువులకు పోషకపదార్ధాలను మేతగా ఇవ్వాలి. పశువులు గర్భంతో ఉంటే పిండం పెరుగుదలకు కావాల్సిన అధిక పోషకాహారం అందించాల్సి ఉంటుంది.