Nalgonda District Court : పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. 51ఏళ్లు జైలు శిక్ష.. ఇంకా..
పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు (Nalgonda District Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి 51ఏళ్లు శిక్ష విధిస్తూ ..

Nalgonda District Court
Nalgonda District Court : పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు (Nalgonda District Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూంను కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడికి 51ఏళ్లు శిక్ష విధిస్తూ ఎస్సీఎస్టీ కోర్టు జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారు. అంతేకాక.. 85వేలు జరిమానా విధిస్తూ.. బాధితురాలికి 7లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.
అత్యాచార కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో పదేళ్ళు, సెక్షన్ 506 (మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. 2021లో తిప్పర్తి పీఎస్ పరిధిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఖయ్యూం నిందితుడు. 2022 నుంచి జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో బలమైన సాక్ష్యాధారాలను తిప్పర్తి ఎస్ఐ శంకర్ కోర్టుకు దాఖలు చేశారు. కోర్టుకు సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో శిక్ష నుంచి నిందితుడు తప్పించుకోలేక పోయాడు.