Apple iOS 26 Beta 8 : గుడ్ న్యూస్.. ఐఫోన్ యూజర్ల కోసం iOS 26 బీటా 8 అప్‌డేట్ ఆగయా.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?
Apple iOS 26 Beta 8 : ఆపిల్ ఐఫోన్ యూజర్లు iOS 26 బీటా 8 అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Apple iOS 26 Beta 8
Apple iOS 26 Beta 8 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. iOS 26 బీటా 8 అప్‌డేట్ వచ్చేసింది. అలాగే, ఐప్యాడ్ కోసం iPadOS 26 బీటా 8 కూడా (Apple iOS 26 Beta 8) రిలీజ్ చేసింది.
ఈ లేటెస్ట్ బీటా వెర్షన్ ముందుగా డెవలపర్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలో పబ్లిక్ బీటా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్స్‌తో పాటు ఆపిల్ మిగిలిన OS 26 సూట్ కోసం macOS Tahoe 26 బీటా 8, బీటా 8 కూడా రిలీజ్ చేసింది.
iOS 26 ‘లిక్విడ్ గ్లాస్’ ఇంటర్‌ఫేస్‌తో కొత్త డిజైన్ కలిగి ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్ కలిగి ఉంటుంది. ఈ అప్‌డేట్ లాక్ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. మెసేజెస్ యాప్‌లో కస్టమ్ బ్యాక్‌గ్రౌండ్‌లు కూడా పెట్టుకోవచ్చు. మెసేజెస్‌లో గ్రూప్ చాట్ పోలింగ్, ఫోన్ యాప్, కార్‌ప్లే, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అలాగే, అనేక ఇతర అప్‌డేట్స్‌తో పాటు కొత్త రింగ్‌టోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
మీరు iOS 26 బీటా 8 కోసం చూస్తుంటే.. ఈ కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే, బీటా వెర్షన్‌లలో బగ్స్ ఉండవచ్చు. సాధారణంగా ఈ బీటా వెర్షన్ ఇన్ స్టాల్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ అప్‌డేట్ చేయాలని భావిస్తే ముందుగా మీ ఐఫోన్ డేటాను బ్యాకప్ తీసుకోండి. ఆ తర్వాతే ఇన్‌స్టాల్ చేయండి.
iOS 26 బీటా 8 డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలంటే? :
- మీ ఐఫోన్‌లో Settings యాప్ ఓపెన్ చేయండి.
- General > Software Update వెళ్లండి.
- లేటెస్ట్ బీటా వెర్షన్ కోసం Download & Install ట్యాప్ చేయండి.
- ఇన్‌స్టాలేషన్ పూర్తి కాగానే మీ ఐఫోన్ రీస్టార్ట్ అవుతుంది.
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ లైనప్‌లో మొత్తం 4 స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉంటాయని భావిస్తున్నారు. అందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉంటాయి.